Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్‌తో అదరగొట్టాడు. బ్యాటింగే కాదు.. కీపింగ్‌లోనూ తాను తోపేనని అతడు ప్రూవ్ చేసుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్‌తో అదరగొట్టాడు. బ్యాటింగే కాదు.. కీపింగ్‌లోనూ తాను తోపేనని అతడు ప్రూవ్ చేసుకున్నాడు.
Nidhan
హెన్రిచ్ క్లాసెన్.. ఈ పేరు వినగానే అందరికీ విధ్వంసక బ్యాటర్ గుర్తుకొస్తాడు. సింగిల్ హ్యాండ్‌తో సౌతాఫ్రికా జట్టుకు ఎన్నో విక్టరీలు అందించాడతను. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ మరింత పేరు తెచ్చుకున్నాడు క్లాసెన్. ఓడిపోయే మ్యాచుల్లో కూడా తన బ్యాటింగ్ ప్రతిభతో ఎస్ఆర్హెచ్ను ఒడ్డున పడేశాడు. అతడు క్రీజులో ఉంటే ఎంతటి బౌలర్ అయినా గడగడలాడాల్సిందే. అయితే మెరుపు బ్యాటింగ్‌తో ఇంత క్రేజ్ సంపాదించిన క్లాసెన్‌లో ఓ అద్భుతమైన కీపర్ కూడా ఉన్నాడు. ఇది పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బయటపడింది. గత సీజన్లలో కూడా ఎస్ఆర్హెచ్ కీపింగ్ బాధ్యతల్ని మోసిన క్లాసెన్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్‌తో అందర్నీ షాక్‌కు గురిచేశాడతను.
పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఓవర్లన్నీ ఆడి 182 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టును ఎస్ఆర్హెచ్ బౌలర్లు వణికించారు. స్వింగ్‌కు పిచ్ అనుకూలిస్తుండటంతో భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ చెలరేగిపోయారు. భువీ వేసిన ఫస్ట్ ఓవర్ మెయిడిన్ అయింది. నెక్స్ట్ ఓవర్లో బెయిర్‌స్టోను క్లీన్‌బౌల్డ్ చేశాడు కమిన్స్. దీంతో ప్రెజర్లో పడ్డాడు శిఖర్ ధావన్ (14). పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డ పంజాబ్ కెప్టెన్.. ఐదో ఓవర్లో భువీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సాధారణంగా పేసర్ల బౌలింగ్‌లో వికెట్లు వదిలేసి ఆడేందుకు ధావన్ ఇష్టపడతాడు. కాస్త ముందుకొచ్చి షాట్లు కొట్టడం అతడి స్టైల్. కానీ నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ కీపర్ క్లాసెన్ అతడి ముందరికాళ్లకు బంధం వేశాడు.
ధావన్‌ను ఔట్ చేసేందుకు భువీని బౌలింగ్‌కు దింపాడు సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. అలాగే కీపర్ క్లాసెన్‌ను వికెట్ల మీదకు రావాలని సూచించాడు. ఈ ట్రిక్ వర్కౌట్ అయింది. షాట్స్ కనెక్ట్ కాకపోవడం, ముందుకు వెళ్లడానికి ఛాన్స్ లేకపోవడంతో ధావన్ ఫ్ట్రస్టేషన్కు గురయ్యాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి ముందుకొచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. భువీ గుడ్‌లెంగ్త్‌లో వేసిన ఆ బాల్‌ను టచ్ కూడా చేయలేకపోయాడు. అయితే 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతిని వికెట్ల వెనుక రెడీగా ఉన్న క్లాసెన్ అందుకున్నాడు. ధావన్ తిరిగి క్రీజును చేరేలోపే స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో పంజాబ్ కెప్టెన్ షాకయ్యాడు. అంత స్పీడ్‌గా వచ్చిన బాల్‌ను క్యారీ చేయడం, పర్ఫెక్ట్ టైమింగ్‌తో స్టంపౌట్ చేయడంతో పిచ్చోడైపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. ఇది ధోనీని మించిన స్టంపింగ్ అంటూ మెచ్చుకుంటున్నారు. మరి.. క్లాసెన్ సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
WHAT A STUMPING BY KLASSEN 🤯🔥pic.twitter.com/AHo1bjyoHL
— Johns. (@CricCrazyJohns) April 9, 2024