iDreamPost

Suryakumar Yadav: ఆ బౌలర్ అంటే చచ్చేంత భయం.. అతడు నా కాలు విరగ్గొట్టాడు: సూర్యకుమార్

  • Published Apr 12, 2024 | 5:46 PMUpdated Apr 12, 2024 | 5:46 PM

పించ్ హిట్టింగ్​తో బౌలర్లకు పీడకలగా మారాడు సూర్యకుమార్ యాదవ్. అతడికి ఎలా బౌలింగ్ చేయాలో తెలియక టాప్ బౌలర్స్ కూడా గుడ్లు తేలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటోడికి ఓ బౌలర్ అంటే చచ్చేంత భయమట.

పించ్ హిట్టింగ్​తో బౌలర్లకు పీడకలగా మారాడు సూర్యకుమార్ యాదవ్. అతడికి ఎలా బౌలింగ్ చేయాలో తెలియక టాప్ బౌలర్స్ కూడా గుడ్లు తేలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటోడికి ఓ బౌలర్ అంటే చచ్చేంత భయమట.

  • Published Apr 12, 2024 | 5:46 PMUpdated Apr 12, 2024 | 5:46 PM
Suryakumar Yadav: ఆ బౌలర్ అంటే చచ్చేంత భయం.. అతడు నా కాలు విరగ్గొట్టాడు: సూర్యకుమార్

సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు వింటే ఎంతటి బౌలర్లు అయినా వణుకుతారు. క్రికెట్​ బుక్​లోని అన్ని షాట్స్​ను ఆడే నైపుణ్యం కలిగిన మిస్టర్ 360.. ఇంకొన్ని వైవిధ్యమైన షాట్లతోనూ ఆకట్టుకుంటున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన సుప్లా షాట్​తో మంచి బంతుల్ని కూడా బౌండరీలు, సిక్సులుగా మలచడం సూర్య భాయ్ స్టైల్. క్రీజులోకి వచ్చిందే ఆలస్యం దొరికిన బాల్​ను దొరికినట్లు స్టాండ్స్​లోకి పంపిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారాడు స్కై. గాయం తర్వాత రీఎంట్రీలో ఆడిన రెండో మ్యాచ్​లోనే ఆర్సీబీ మీద విరుచుకుపడ్డాడు. 19 బంతుల్లోనే 52 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్​తో పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. అలాంటోడు ఓ బౌలర్ అంటే తనకు చచ్చేంత భయమని అన్నాడు.

టాప్ బౌలర్లను కూడా ఓ ఆటాడుకునే సూర్యకుమార్​ యాదవ్​కు ఒక పేసర్​ను చూస్తే వణుకు పుడుతుందట. అతడి బౌలింగ్​లో ఆడాలంటేనే వెనుకంజ వేస్తాడట. ఎక్కడ కాలు విరగ్గొడతాడోనని టెన్షన్ పడతాడట. మిస్టర్ 360ని అంతగా భయపడెతున్న ఆ బౌలర్ మరెవరో కాదు.. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా. ఇప్పటికే పలుమార్లు నెట్స్​లో బుమ్రా వేసిన బంతులకు తన కాలి పాదానికి గాయాలు అయ్యాయని సూర్య తెలిపాడు. ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్​లో మాట్లాడిన ఈ స్టార్ బ్యాటర్ బుమ్రా పెర్ఫార్మెన్స్​ను మెచ్చుకున్నాడు. అలాంటి బౌలర్ తమ టీమ్​లో ఉండటం అదృష్టమని చెప్పాడు. అయితే గత 2 నుంచి 3 ఏళ్లుగా బుమ్రా బౌలింగ్​లో ఆడటమే మానేశానని తెలిపాడు. బ్యాట్ లేదా కాలు విరగ్గొడతాడేమోననే భయమే దీనికి కారణమని పేర్కొన్నాడు.

బుమ్రా బౌలింగ్​లో బ్యాటింగ్ చేయడం కష్టమని.. మరీ ముఖ్యంగా అతడి యార్కర్లను ఎదుర్కోవడం అసాధ్యమన్నాడు సూర్యకుమార్. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన సూర్యనే ఇలా అంటున్నాడంటే.. బుమ్రా బౌలింగ్​లో మిగతా బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక, ఆర్సీబీతో మ్యాచ్​లో అటు బౌలింగ్​లో బుమ్రా, ఇటు బ్యాటింగ్​లో సూర్యకుమార్ రఫ్ఫాడించారు. 4 ఓవర్లు వేసిన పేసుగుర్రం 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్​తో పాటు మహిపాల్ లోమ్రోర్, సౌరవ్ చౌహాన్, వైశాఖ్ విజయ్ కుమార్​ను అతడు ఔట్ చేశాడు. కాగా, ముంబై ఇన్నింగ్స్​లో సూర్య బ్యాటింగ్​ హైలైట్​గా నిలిచింది. 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 52 పరుగులు చేశాడతను. మరి.. బుమ్రా బౌలింగ్​ అంటే భయమంటూ సూర్య చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి