iDreamPost

LSG vs DC: కోహ్లీ ఫెయిలైనా కేఎల్ రాహుల్ సాధించాడు.. BCCI కోరుకుంటోంది ఇదే!

  • Published Apr 12, 2024 | 9:16 PMUpdated Apr 12, 2024 | 9:16 PM

లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫెయిలైనా కేఎల్ దాన్ని సాధించాడు.

లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫెయిలైనా కేఎల్ దాన్ని సాధించాడు.

  • Published Apr 12, 2024 | 9:16 PMUpdated Apr 12, 2024 | 9:16 PM
LSG vs DC: కోహ్లీ ఫెయిలైనా కేఎల్ రాహుల్ సాధించాడు.. BCCI కోరుకుంటోంది ఇదే!

ఐపీఎల్-2024లో ఫస్ట్ మ్యాచ్​లోనే ఓటమితో నిరాశలో కనిపించిన లక్నో సూపర్ జియాంట్స్ దాని నుంచి వెంటనే కోలుకుంది. ఆ తర్వాత హ్యాట్రిక్ విక్టరీస్​తో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపించింది. ఢిల్లీ క్యాపిటల్స్​తో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్​నూ పాజిటివ్​గా స్టార్ట్ చేసింది ఎల్​ఎస్​జీ. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరో ఓపెనర్​తో క్వింటన్ డికాక్ (19)తో కలసి ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేసిన రాహుల్ ఫస్ట్ వికెట్​కు 3 ఓవర్లలో 29 పరుగులు అందించాడు. ఆ తర్వాత డికాక్ ఔటైనా రాహుల్ మాత్రం ఒక ఎండ్​లో పరుగులు చేస్తూ పోయాడు. ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లేకపోయినా అతడు మాత్రం బౌండరీల మీద బౌండరీలు కొట్టాడు. ఈ క్రమంలో కోహ్లీ సాధించలేనిది అచీవ్ చేసి చూపించాడతను.

ఈ ఐపీఎల్​లో కోహ్లీతో పాటు రాహుల్ కూడా స్లోగా రన్స్ చేస్తూ విమర్శల పాలవుతున్నాడు. అతడి స్ట్రయిక్ రేట్ మీద నెట్టింట భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. విరాట్ స్ట్రయిక్ రేట్ 141గా ఉండగా.. రాహుల్ స్ట్రయిక్ రేట్ 128గా ఉంది. యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడుతున్న కింగ్ అయినా కాస్త వేగంగా పరుగులు చేస్తున్నాడు. కానీ కేఎల్ మాత్రం స్లో బ్యాటింగ్​తో అందరికీ నీరసం వచ్చేలా చేస్తున్నాడు. దీంతో వీళ్లిద్దర్నీ టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోలింగ్ అంశం ఆ నోటా ఈ నోటా పడి చివరికి వీళ్లిద్దరి చెవికి చేరినట్లుంది. దీంతో నిన్న ముంబై ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో స్పీడ్​గా రన్స్ చేసేందుకు విరాట్ ప్రయత్నించాడు. కానీ అలా ఆడే క్రమంలో చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. అయితే ఇవాళ కేఎల్ రాహుల్ మాత్రం దీన్ని సాధించాడు.

KL Rahul

ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు కేఎల్ రాహుల్. పవర్​ప్లేలో పించ్ హిట్టింగ్​కు దిగాడు. 14 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. పవర్​ప్లేలో అతడి స్ట్రయిక్ రేట్ 214.3గా ఉంది. దీన్ని బట్టే కేఎల్ ఏ రేంజ్​లో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్​గా ఈ మ్యాచ్​లో 22 బంతులు ఎదుర్కొన్న ఎల్​ఎస్​జీ కెప్టెన్.. 39 పరుగులు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. అందులో 1 సిక్స్​తో పాటు 5 బౌండరీలు ఉన్నాయి. ఖలీల్ అహ్మద్ బౌలింగ్​లో ఆఫ్ సైడ్ అతడు కొట్టిన సిక్స్ లక్నో ఇన్నింగ్స్​కే హైలైట్​గా నిలిచింది. రాహుల్ బ్యాటింగ్​పై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కేఎల్ బ్యాటింగ్ అదిరిందని, అతడి నుంచి బీసీసీఐ కూడా ఇదే కోరుకుంటోందని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో రాహుల్ ఇలా ఆడితే తప్ప టీమ్​లో చోటు దక్కించుకోవడం కష్టమని అంటున్నారు. మరి.. రాహుల్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి