iDreamPost
android-app
ios-app

Sunil Narine: నరైన్ మాస్ హిట్టింగ్.. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు!

  • Published Apr 16, 2024 | 9:08 PMUpdated Apr 16, 2024 | 9:15 PM

కోల్​కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ మాస్ హిట్టింగ్​తో చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లను అతడు ఊచకోత కోశాడు.

కోల్​కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ మాస్ హిట్టింగ్​తో చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లను అతడు ఊచకోత కోశాడు.

  • Published Apr 16, 2024 | 9:08 PMUpdated Apr 16, 2024 | 9:15 PM
Sunil Narine: నరైన్ మాస్ హిట్టింగ్.. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు!

కోల్​కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్​తో మ్యాచ్​లో విశ్వరూపం చూపించాడు. 49 బంతుల్లోనే 100 పరుగుల మార్క్​ను చేరుకున్నాడు. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన నరైన్.. మిగిలిన 50 పరుగుల్ని అందుకోవడానికి 20 బంతులే తీసుకున్నాడు. 11 బౌండరీలు బాదిన ఈ కరీబియన్ వీరుడు.. 6 భారీ సిక్సులు కొట్టాడు. ఆకాశమే హద్దుగా బ్యాట్​తో వీరంగం సృష్టించాడు. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్​ను టార్గెట్ చేసుకొని భారీ షాట్లు బాదాడు. ఇతడి దెబ్బకు వాళ్లిద్దరూ కలసి ఏకంగా 103 పరుగులు సమర్పించుకున్నారు. దీన్ని బట్టే నరైన్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

నరైన్​కు తోడుగా అంగ్క్రిష్ రఘువంశీ కూడా అదరగొట్టాడు. 18 బంతుల్లోనే 30 పరుగులు చేశాడతను. పద్దెనిమిదేళ్ల రఘువంశీ బౌండరీలు మీద బౌండరీలు బాదుతూ రాజస్థాన్ బౌలర్లతో ఆటాడుకున్నాడు. ఒకవైపు అతడు చెలరేగుతుండటంతో మరోవైపు నరైన్ ఊచకోత కోయడం కంటిన్యూ చేశాడు. వీళ్లిద్దరి దెబ్బకు ఆర్ఆర్ బౌలర్ల గుడ్లు తేలేశారు. ఆ తర్వాత రఘువంశీ ఔటైనా నరైన్ మాత్రం ఆగలేదు. మరింత జోరు పెంచి సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు. కాగా, అప్పట్లో కేకేఆర్​కు ఓపెనర్​గా వచ్చి రాణించాడు నరైన్. అలాంటోడ్ని మళ్లీ ఈ సీజన్​లో అదే పొజిషన్​లో ఆడిస్తున్నారు. దీన్ని యూజ్ చేసుకొని విధ్వంసక ఇన్నింగ్స్​లతో విరుచుకుపడుతున్నాడు నరైన్. దీనికి కేకేఆర్ కొత్త మెంటార్ గౌతం గంభీర్​కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మరి.. నరైన్ మెరుపు సెంచరీపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి