iDreamPost

Jasprit Bumrah: వీడియో: భారీ షాట్లతో విరుచుకుపడిన బుమ్రా! పాండ్యా కంటే వందరెట్లు నయం!

ఎప్పుడూ బౌలింగ్ ప్రాక్టీస్ చేసే బుమ్రా.. ఈసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించి, అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆ వీడియోను మీరు చూసేయండి.

ఎప్పుడూ బౌలింగ్ ప్రాక్టీస్ చేసే బుమ్రా.. ఈసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించి, అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆ వీడియోను మీరు చూసేయండి.

Jasprit Bumrah: వీడియో: భారీ షాట్లతో విరుచుకుపడిన బుమ్రా! పాండ్యా కంటే వందరెట్లు నయం!

ఐపీఎల్ 2024లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా ఏప్రిల్ 27(శనివారం)న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొనబోతోంది ముంబై ఇండియన్స్. ఇందుకోసం ఇరు జట్ల ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. నెట్స్ లో గంటల తరబడి ప్రాక్టీస్ లో మునిగిపోయారు. అయితే ఎప్పుడూ బౌలింగ్ ప్రాక్టీస్ చేసే బుమ్రా.. ఈసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించి, అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జస్ప్రీత్ బుమ్రా.. యార్కర్ల కింగ్ గా వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రవేసుకున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో బంతితో అదరగొడుతున్నాడు. ఇప్పటికే 13 వికెట్లు తీసుకుని లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. ఇక శనివారం(ఏప్రిల్ 27) ఢిల్లీతో జరగబోయే మ్యాచ్ కోసం గంటల తరబడి నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. అయితే ఈసారి చిన్న ఛేంజ్.. ప్రాక్టీస్ చేసింది బౌలింగ్ కాదు, బ్యాటింగ్. అవును నెట్స్ లో బుమ్రా గంటల తరబడి బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రివర్స్ స్వీప్, ఫుల్ షాట్స్ ఇలా ఒక్కటేమిటి అన్ని షాట్స్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. పదుల సంఖ్యలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటంటే?

కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ లాగే.. బుమ్రాను కూడా ఓపెనింగ్ కు పంపుతారా? బ్యాటింగ్ ఆర్డర్ లో మేనేజ్ మెంట్ మార్పు కోరుకుంటుందా? అంటు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఛాన్స్ లను కొట్టిపారేయలేమని కొన్ని నివేదికలు సైతం పేర్కొంటున్నాయి. అదే జరిగితే రోహిత్ శర్మతో కలిసి బుమ్రా ముంబై ఇన్నింగ్స్ ను ఆరంభించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కంటే వందరెట్లు బెటర్ గా బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నాడని కితాబిస్తున్నారు. మరి బుమ్రాను ఓపెనర్ గా పంపితే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి