iDreamPost

సీరియల్ కిల్లర్ సినిమాలు ఇష్టమా? OTTలో ఇంత మంచి మూవీ ఎలా మిస్ అయ్యారు!

  • Published May 17, 2024 | 6:56 PMUpdated May 17, 2024 | 6:56 PM

OTT Best PsychoThriller Movie: ఓటీటీ లో ఎన్నో థ్రిల్లర్ మూవీస్ చూసి ఉంటారు కానీ.. ఇలాంటి ఓ సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. ఈ థ్రిల్లర్ సినిమాను మీరు చూసారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

OTT Best PsychoThriller Movie: ఓటీటీ లో ఎన్నో థ్రిల్లర్ మూవీస్ చూసి ఉంటారు కానీ.. ఇలాంటి ఓ సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. ఈ థ్రిల్లర్ సినిమాను మీరు చూసారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

  • Published May 17, 2024 | 6:56 PMUpdated May 17, 2024 | 6:56 PM
సీరియల్ కిల్లర్ సినిమాలు ఇష్టమా? OTTలో ఇంత మంచి మూవీ ఎలా మిస్ అయ్యారు!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఉన్న అన్ని సినిమాలను చూసాం అని అనుకునే వారికి ఇంకా చూడాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి అని కొన్ని సినిమాలు గుర్తు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎంత చూసినా తనివి తీరానన్ని సినిమాలు ఓటీటీ లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్స్ జోనర్ లో చాలా తక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు చూడడానికి ఓ మంచి ఎక్స్పీరియన్స్ ను కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం.. వెంటనే చూసేయండి, మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

థ్రిల్లర్ మూవీస్ లో అనేక రకాల జోనర్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం ఓ సైకలాజికల్ క్రైం థ్రిల్లర్. ఈ సినిమా పేరు “ది కాల్”. సైకో క్రైమ్స్, మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమా కథ విషయానికొస్తే.. జోర్డాన్ అనే మహిళ 911 కాల్ సెంటర్ లో పని చేస్తూ ఉంటుంది. ఇక సాధారణంగా ఇలాంటి కాల్ సెంటర్స్ కు ఫేక్ కాల్స్ రావడం సహజం. ఓ రోజు ఈ కాల్ సెంటర్ కు 15 ఏళ్ల అమ్మాయి ఏడుస్తూ కాల్ చేస్తుంది. ఇంట్లో ఎవరు లేరని.. బయటనుంచి ఎవరో వ్యక్తి గట్టిగ డోర్ కొడుతున్నారని.. భయంగా ఉందని చెప్తుంది. కానీ ఈలోపే ఆ వ్యక్తి ఆ ఇంట్లోకి చొరబడతాడు. ఆమె కాల్ కూడా కట్ అయిపోతుంది.

అక్కడ ఏం జరుగుతుందో తెలియక.. జోర్డాన్ ఆ నెంబర్ కు మళ్ళీ కాల్ చేస్తుంది. ఈసారి ఆ కిల్లర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ ట్రాక్ చేశాం పోలీసులు వస్తున్నారు అని జోర్డాన్ చెప్తున్న మాటలు ఆ కిల్లర్ వింటాడు. దీనితో దాక్కున్నా ఆ అమ్మాయిని బయటకు లాగి కొడతాడు, ఆ తర్వాత రోజు ఆ అమ్మాయి ఘోరంగా చనిపోయినట్లు టీవీ లో ప్రకటిస్తారు. దీనితో ఇదంతా తన వలనే జరిగిందని జోర్డాన్ ఆ జాబ్ మానేస్తుంది. అక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్లకు ట్రైనింగ్ ఇస్తుంటుంది. ఆ తర్వాత మరొక కేసు వస్తుంది. మాల్ లో ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉంటారు. అందులో ఓ అమ్మాయిని కొందరు వ్యక్తులు కిడ్నప్ చేస్తారు. దీనితో ఆమె 911కి కాల్ చేస్తుంది. ఈసారి జోర్డాన్ ఆ అమ్మాయిని ఎలా కాపాడింది! ఇంతకీ ఆ సైకో అమ్మాయిలను కిడ్నాప్ చెయ్యడానికి ప్రధాన కారణం ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి