iDreamPost

IPL 2024: వీడియో: ఢిల్లీతో మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని సీన్.. భయపడ్డ హర్షిత్ రాణా!

DC vs KKR మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని సీన్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. హర్షిత్ రాణా ఈ మ్యాచ్ లో భయపడ్డాడు. అసలేం జరిగిందంటే?

DC vs KKR మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని సీన్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. హర్షిత్ రాణా ఈ మ్యాచ్ లో భయపడ్డాడు. అసలేం జరిగిందంటే?

IPL 2024: వీడియో: ఢిల్లీతో మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని సీన్.. భయపడ్డ హర్షిత్ రాణా!

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది కోల్ కత్తా నైట్ రైడర్స్. తక్కువ స్కోర్లకే పరిమితమైన ఈ మ్యాచ్ లో కేకేఆర్ సత్తాచాటింది. కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(68) జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని సీన్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. హర్షిత్ రాణా ఈ మ్యాచ్ లో భయపడ్డాడు. అసలేం జరిగిందంటే?

ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది కేకేఆర్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. బ్యాటర్లందరూ దారుణంగా విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 రన్స్ చేసింది. జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 26 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్ సహాయంతో 35 పరుగులు చేసి నాటౌట్ గా టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా తలా రెండు వికెట్లు కూల్చారు.

A scene that no one noticed in the match against Delhi

అనంతరం 154 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో, 68 పరుగుల మెరుపు బ్యాటింగ్ తో విజయానికి గట్టి పునాది వేశాడు. దీంతో అలవోకగా కేకేఆర్ సింపుల్ టార్గెట్ ను ఛేదించింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని సీన్ ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో 7వ ఓవర్ వేయడానికి వచ్చాడు కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా. ఈ ఓవర్ లో 4వ బంతికి అభిషేక్ పోరెల్ ను బౌల్డ్ చేశాడు. అనంతరం తన స్టైల్లో ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని భావించాడు. కానీ కిస్ పెట్టబోయి ఆగిపోయాడు.

దానికి కారణం ఈ టోర్నీలో భాగంగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ ను ఔట్ చేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో క్రమశిక్షణా చర్యల కింద రాణాకు మ్యాచ్ ఫీజులో ఏకంగా 60 శాతం కోత విధించారు. దీంతో ఈ మ్యాచ్ లో అలా చేయబోయి.. సడెన్ గా ఈ కోత గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. దీంతో హర్షిత్ రాణా భయపడ్డాడు, కాస్త బుద్ది తెచ్చుకున్నాడు  అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by C R i C K E T (@cricket_lovers_93)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి