iDreamPost

OTTలోకి కొత్తగా వచ్చిన ఈ 3 సినిమాలతో.. ఈ వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు!

This Week OTT Releases- Weekend OTT Movie Suggestions: వీకెండ్ వస్తోంది అంటే ఓటీటీ ఆడియన్స్ అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే వీకెండ్ మొత్తాన్ని సినిమాలతో పిచ్చెక్కించేయాలి అని ఫిక్స్ పోతారు. అలాంటి వారికోసం వీకెండ్ సజీషన్ తీసుకొచ్చాం.

This Week OTT Releases- Weekend OTT Movie Suggestions: వీకెండ్ వస్తోంది అంటే ఓటీటీ ఆడియన్స్ అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే వీకెండ్ మొత్తాన్ని సినిమాలతో పిచ్చెక్కించేయాలి అని ఫిక్స్ పోతారు. అలాంటి వారికోసం వీకెండ్ సజీషన్ తీసుకొచ్చాం.

OTTలోకి కొత్తగా వచ్చిన ఈ 3 సినిమాలతో.. ఈ వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు!

అప్పుడే వీకెండ్ వచ్చేసింది. మరి.. వీకెండ్ అంటే చాలామందికి చాలా ప్లాన్స్ ఉంటాయి. కానీ, ఓటీటీలు వచ్చిన తర్వాత అందరిదీ ఒకటే ప్లాన్ అయిపోయింది. అదేంటంటే.. వీకెండ్లో ఇంట్లో కూర్చుని అదిరిపోయే సినిమాలు చూసేయాలి. అందుకోసం వీక్ మొత్తం ప్లాన్ చేస్తూ ఉంటారు. వీకెండ్ మొత్తాన్ని మూవీ డేస్ మార్చేస్తారు. అలాంటి వారికోసం ఈ వీక్ అదిరిపోయే సినిమాలు వచ్చేశారు. ఏకంగా మే 17న తారీఖు ఒక్కరోజే 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో అన్నింటిని మీరు చూడలేరు కదా? అందుకే మీకోసం వాటిలో నుంచి ది బెస్ట్ 3 మూవీస్ ని సజెస్ట్ చేస్తున్నాం. మరి.. ఈ వీకెండ్ ని ఓటీటీ మూవీస్ కార్నివాల్ గా మార్చేయండి.

ఓటీటీలో మీకు బోలెడన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే వాటిలో అన్నింటిని చూసేందుకు వీలు కాదు. చాలా మంది వీకెండ్ అనగానే థియేటర్ కి వెళ్లాలి అనుకుంటారు. కానీ, ఈవారం సింగిల్ స్క్రీన్స్ అన్నీ బంద్ ఉన్నాయి. కాబట్టి ఈ వీకెండ్ లో ఓటీటీ మూవీస్ ని ఒకచూపు చూస్తే.. వీకెండ్ హ్యాపీగా గడిచిపోతుంది. ఈ వారం మొత్తం అన్నీ ఓటీటీల్లో కలిపి 22 సినిమాలు విడుదలయ్యాయి. అయితే వాటిని పక్కన పెడితే మే 17వ తారీఖు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్కరోజే 12 సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. వాటిలో కూడా ది బెస్ట్ 3 సినిమాలను మీకోసం సజెస్ట్ చేస్తున్నాం. వాటిలో మీ ఈ వీకెండ్ సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది.

మే 17 ఓటీటీ రిలీజెస్:

  • అమెజాన్ ప్రైమ్ వీడియో:
  • కృష్ణమ్మ
  • 99 (ఇంగ్లీష్ సిరీస్)
  • నెట్ ఫ్లిక్స్:
  • ది 8 షో (కొరియన్ సిరీస్)
  • పవర్ (ఇంగ్లీష్ సిరీస్)
  • థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ మూవీ)
  • హాట్ స్టార్:
  • బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్)
  • జీ5:
  • బస్తర్: ది నక్సల్ స్టోరీ
  • తళమై సెయలగమ్ (తమిళ్ సిరీస్ )
  • ఆహా: విద్యా వాసుల అహం
  • ఎమ్మెక్స్ ప్లేయర్: ఎల్లా (హిందీ సినిమా)
  • యాపిల్ ప్లస్ టీవీ: ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్)

17వ తారీఖు ఓటీటీల్లోకి వచ్చిన ఈ 12 మూవీస్ లో టాప్, ది బెస్ట్ 3 మూవీస్ చెప్పమంటే.. అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న సత్యదేవ్ కృష్ణమ్మ పేరు చెప్పచ్చు. ఈ మూవీలో సత్యదేవ్ న్యాచురల్ యాక్టింగ్ తో అందరి ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న రాజశేఖర్ కుమార్తె చేసిన విద్య వాసుల అహం సినిమా పేరు చెప్పచ్చు. ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ. పైగా ప్రతి భార్యాభర్తలు తమని ఈ క్యారెక్టర్స్ లో చూసుకునే అవకాశం ఉంది. ఇంక ఫైనల్ గా అదా శర్మ నటించిన బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీ పేరు చెప్పచ్చు. ఇది ఒక పోస్టర్ తోనే వివాదాలు రేపింది. పైగా మంచి అప్లాజ్ కూడా అందుకుంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ ఈ మూవీస్ చూసేసి ఇరగదీసేయండి. పై లిస్ట్ లో ఇంకా ఏవైనా మూవీస్ బాగుంటాయి అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి