iDreamPost

IPL.. ఏ జట్టు ఎవర్ని వదిలేసింది? ఏ టీమ్‌లో ఎవరున్నారు? పూర్తి లిస్ట్‌ ఇదే

  • Published Nov 27, 2023 | 6:21 PMUpdated Nov 27, 2023 | 6:21 PM

ఐపీఎల్‌ 2024 ఇప్పటి నుంచే మొదలైనట్లు కనిపిస్తోంది. ఆటగాళ్ల ఇంటర్నల్‌ ట్రేడింగ్‌, రిటేన్‌, రిలీజ్‌ ప్రక్రియతో ఒక్కసారిగా క్రికెట్‌ అభిమానుల్లో ఐపీఎల్‌ టీమ్స్‌ గురించి చర్చ మొదలైంది. అయితే.. మరి ఏ టీమ్‌ రిటేన్‌ చేసుకుని, ఎవర్ని వదులుకుందో వివరంగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024 ఇప్పటి నుంచే మొదలైనట్లు కనిపిస్తోంది. ఆటగాళ్ల ఇంటర్నల్‌ ట్రేడింగ్‌, రిటేన్‌, రిలీజ్‌ ప్రక్రియతో ఒక్కసారిగా క్రికెట్‌ అభిమానుల్లో ఐపీఎల్‌ టీమ్స్‌ గురించి చర్చ మొదలైంది. అయితే.. మరి ఏ టీమ్‌ రిటేన్‌ చేసుకుని, ఎవర్ని వదులుకుందో వివరంగా తెలుసుకుందాం..

  • Published Nov 27, 2023 | 6:21 PMUpdated Nov 27, 2023 | 6:21 PM
IPL.. ఏ జట్టు ఎవర్ని వదిలేసింది? ఏ టీమ్‌లో ఎవరున్నారు? పూర్తి లిస్ట్‌ ఇదే

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఆటగాళ్ల ఇంటర్నల్‌ ట్రెడింగ్‌, రిలీజ్‌ అండ్‌ రిటేన్‌ ప్రక్రియతో ఒక్కసారిగా క్రికెట్‌ వర్గాల్లో ఐపీఎల్‌ టీమ్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ప్రతి ఏడాది ఫామ్‌లో లేని ఆటగాళ్లను, జట్టుకు భారంగా మారిన ప్లేయర్లను, సీజన్‌కు అందుబాటులో ఉండని ప్లేయర్లను ఆయా ఫ్రాంచేజీలు వదిలేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఐపీఎల్‌ 2024 సీజన్‌ వేలానికి దాదాపు అన్ని జట్లు కొంతమంది ఆటగాళ్లను రిలీజ్‌ చేసింది. వాటిలో కొన్ని స్టార్‌ ప్లేయర్ల పేర్లు కూడా ఉన్నాయి. అయితే.. ఆయా జట్లు వదిలేసుకున్న ఆటగాళ్ల లిస్ట్‌తో పాటు.. ప్రస్తుతం టీమ్‌లో మిగిలి ఉన్న ఆటగాళ్ల పూర్తి లిస్ట్‌ ఇలా ఉంది..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..
రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు.. వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, జోష్ హేజిల్‌వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోను యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేధార్ జాదవ్. రిటేన్ చేసుకున్న ప్లేయర్లు.. డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ, రజత్‌ పటీదార్‌, అనుజ్‌ రావత్‌, దినేష్‌ కార్తీక్‌, ప్రభుదేశాయ్‌, విల్‌ జాక్స్‌, మ్యాక్స్‌వెల్‌, మహిపాల్‌, కరణ్‌ శర్మ, మనోజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, ఆకాశ్‌దీప్‌, సిరాజ్‌, రీస్‌ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్‌కుమార్‌, విజయ్‌ కుమార్‌.

ముంబై ఇండియన్స్‌..
రిలీజ్‌ చేసిన ప్లేయర్లు.. అర్షద్‌ ఖాన్‌, రమన్‌దీప్‌ సింగ్‌, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డువాన్ జాన్సెన్, ఝే రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్.

గుజరాత్ టైటాన్స్..
రిలీజ్‌ చేసిన ప్లేయర్లు.. యశ్ దయాల్, కేఎస్.భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సాంగ్వాన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, డసన్ షనక.

లక్నో సూపర్ జెయింట్..
రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు.. జయదేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, మనన్ వోహ్రా, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, సూర్యాంశ్ షెడ్గే, కరుణ్ నాయర్. రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు.. కేఎల్ రాహుల్ (సి), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్ (RR నుండి), రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ థాకూర్, , అమిత్ మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.

చెన్నై సూపర్ కింగ్స్..
రిలీజ్‌ చేసిన ప్లేయర్లు.. బెన్ స్టోక్స్, డ్వైన్ ప్రిటోరియస్, అంబటి రాయుడు, సిసంద మగల, కైల్ జేమీసన్, భగత్ వర్మ, సేనాపతి మరియు ఆకాష్ సింగ్. రిటేన్‌ చేసుకున్న ఆటగాళ్లు.. ఎంఎస్‌ ధోని, మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరానా, అజింక్యా రహానే, మిచెల్ రషీత్, మిచెల్ రషీద్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ.

సన్‌రైజర్స్ హైదరాబాద్..
రిలీజ్‌ చేసిన​ ఆటగాళ్లు.. హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకేల్ హోసేన్, ఆదిల్ రషీద్.

కోల్‌కతా నైట్ రైడర్స్..
రిలీజ్‌ చేసిన ప్లేయర్లు.. షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, ఆర్య దేశాయ్, డేవిడ్ వీస్, శార్దూల్ ఠాకూర్, నారాయణ్ జగదీసన్, మన్‌దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, జాన్సన్ చార్లెస్.

పంజాబ్ కింగ్స్..
రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు.. భానుకా రాజపక్సే, మోహిత్ రాథీ, బల్తేజ్ ధండా, రాజ్ అంగద్ బావా, షారుక్ ఖాన్.

రాజస్థాన్ రాయల్స్..
జో రూట్, అబ్దుల్ బాసిత్, జాసన్ హోల్డర్, ఆకాష్ వశిష్ట్, కుల్దీప్ యాదవ్, ఒబెద్ మెక్‌కాయ్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, కేఎం ఆసీఫ్.

ఢిల్లీ క్యాపిటల్స్..
రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు..
రిలీ రోసోవ్, చేతన్ సకారియా, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్, ముస్తాఫిజుర్ రెహమాన్, కమలేష్ నాగర్‌కోటి, రిపాల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియాం గార్గ్.

ఇంటర్ననల్‌ ట్రేడింగ్‌ జట్లు మారిన ఆటగాళ్లు..
లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఆల్-రౌండర్ రొమారియో షెపర్డ్‌ ముంబైకి మారాడు. అలాగే గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్ధిక్‌ పాండ్యా ముంబైకి వెళ్లాడు. అలాగే లక్నో నుంచి అవేష్ ఖాన్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ తీసుకుని.. తమ ప్లేయర్‌ దేవదత్ పడిక్కల్‌ను లక్నోకు ఇచ్చింది. పాండ్యా, షెపర్డ్‌ క్యాష్‌ ట్రేడింగ్‌ కాగా, ఆవేష్‌ ఖాన్‌-పడికల్‌ ఆటగాళ్ల మార్పిడి పద్దతిలో మారారు. మరి ప్రక్రియలో ఏ జట్టు లాభపడింది? ఏ టీమ్‌ నష్టపోయింది? అని మీరు భావిస్తున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి