iDreamPost

Sameer Rizvi: ఎవరీ సమీర్ రిజ్వీ? చెన్నై ఎందుకంత ధర పెట్టింది?

'సమీర్ రిజ్వీ'.. ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్ ను రూ. 8.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసి, క్రీడా ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మరి ఎవరీ సమీర్ రిజ్వీ? అతడికి చెన్నై 8 కోట్లు ఎందుకు పెట్టింది?

'సమీర్ రిజ్వీ'.. ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్ ను రూ. 8.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసి, క్రీడా ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మరి ఎవరీ సమీర్ రిజ్వీ? అతడికి చెన్నై 8 కోట్లు ఎందుకు పెట్టింది?

Sameer Rizvi: ఎవరీ సమీర్ రిజ్వీ? చెన్నై ఎందుకంత ధర పెట్టింది?

ఐపీఎల్ 2024 వేలం.. అందరిచూపు దీనిపైనే. ఇక ఎంతో ఆసక్తిగా క్రికెట్ లవర్స్ ఎదురుచూసిన ఈ ఆక్షన్ ప్రారంభం అయ్యింది. వారి అంచనాలను మించి.. ఈ వేలం జరిగిందనే చెప్పాలి. ఇక ఈ వేలం నిర్వహణకు ముందు కొంత మంది ప్లేయర్లపై అందరి కన్ను ఉంది. వారిలో ఆసీస్ స్టార్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ ముందున్నారు. ఇక అందరూ భావించినట్లుగానే వీరిద్దరు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. స్టార్క్ రికార్డు స్థాయిలో రూ. 24.75 కోట్లకు కోల్ కత్తాకు అమ్ముడుపోగా, కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు దక్కించుకుంది. ఇక వీరిద్దరి తర్వాత అంతలా హైప్ క్రియేట్ చేసుకున్న ఆటగాడు ‘సమీర్ రిజ్వీ’. ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్ ను రూ. 8.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసి, క్రీడా ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మరి ఎవరీ సమీర్ రిజ్వీ? అతడికి చెన్నై 8 కోట్లు ఎందుకు పెట్టింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2024 వేలంలో ఎంతో మంది మహామహులైన ప్లేయర్లు ఉన్నారు. కానీ వారందరిని దాటుకుని ఓ అన్ క్యాప్డ్ యంగ్ ప్లేయర్ కు భారీ దక్కింది. దీంతో అందరూ ఒక్కసారిగా అతడు ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటి? అంటూ వెతకడం ప్రారంభించారు. అయితే ఐపీఎల్ వేలం ప్రారంభానికి ముందునుంచే.. అతడి పేరు బలంగా వినిపిస్తోంది. ఈసారి ఆ చిచ్చరపిడుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తన కోసం కొట్టుకుంటాయని టీమిండియా మాజీ క్రికెటర్లు అయిన సురేశ్ రైనా,అభినవ్ ముకుంద్, ఆకాశ్ చోప్రాలు కథలు కథలుగా చెప్పారు. వారి చెప్పినట్లుగానే ఈ వేలంలో జరిగింది. ఆ చిచ్చరపిడుగు పేరే ‘సమీర్ రిజ్వీ’. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సమీర్ ను ఏకంగా రూ.8.4 కోట్లకు దక్కించుకుని అందరిని షాక్ కు గురిచేసింది. దీంతో ఈ యువ సంచలనం ఎవరు? చెన్నై అతడికి ఎందుకు ఫిదా అయ్యింది? అంటూ నెట్టింట వెతకడం మెుదలుపెట్టారు.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన 20 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటర్ సమీర్ రిజ్వీ. సంచలన బ్యాటింగ్ తో పాటుగా మంచి ఆఫ్ స్పిన్నర్ గా సత్తా చాటగలడు. ఇటీవలే జరిగిన యూపీ టీ20 లీగ్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. గోరఖ్ పూర్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 49 బంతుల్లోనే 104 రన్స్ చేసి.. జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఇక మరో మ్యాచ్ లో అయితే ఏకంగా డబుల్ సెంచరీనే సాధించాడు. కేవలం 76 బంతుల్లోనే 23 ఫోర్లు, 17 సిక్స్ లతో 217 పరుగులు చేశాడు.

ఈ క్రమంలోనే సమీర్ రిజ్వీ ఆడింది కేవలం 11 మ్యాచ్ లే అయినప్పటికీ.. అందరి దృష్టిని తనపై పడేలా చేసుకున్నాడు. ఇప్పుడు అదే అతడి దశను మార్చింది. దేశవాళీ క్రికెట్ లో మంచి హిట్టర్ గా పేరుగాంచాడు సమీర్. సంచలన ఇన్నింగ్స్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. దీంతో అతడిపై కన్నేసిన చెన్నై భారీ ధర పెట్టి మరీ కొనుగోలు చేసింది. అలాగే అండర్-23 స్టేట్ ఛాంపియన్ షిప్ టోర్నీలో యూపీకి కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం అతడి సొంతం. దీంతో ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన సమీర్ కు ఇంత ధర పెట్టడంలో ఎలాంటి తప్పులేదంటున్నారు క్రీడా పండితులు. మరి సమీర్ రిజ్వీ ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి