iDreamPost

IPL 2022 సరికొత్త రికార్డు.. 1000 సిక్సర్లు బాదిన వేళ..

IPL 2022 సరికొత్త రికార్డు.. 1000 సిక్సర్లు బాదిన వేళ..

ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న IPL 2022 సీజన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఒక్క సీజన్ లోనే ఇప్పటివరకు 1001 సిక్స్ లు కొట్టారు ఆటగాళ్లు. ఇంకా ప్లే ఆఫ్స్, ఫైనల్ కలిపి మరో నాలుగు మ్యాచ్‌లు ఉండటంతో ఈ సిక్సర్ల సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటివరకు జరిగిన IPL అన్ని సీజన్లలోకెల్లా ఇదే అత్యధికం.

గతంలో IPL 2018లో అన్ని మ్యాచుల్లో కలిపి 872 సిక్సర్లు బాదారు ఆటగాళ్లు. ఆ రికార్డుని ఈ సంవత్సరం అలవోకగా ఊదేశారు. ఇక అన్నిటికంటే తక్కువగా 2009లో 506 సిక్సర్లు కొట్టారు. ఈ 15వ సీజన్ IPL 2022లో మొదటి సిక్సర్‌ను CSK బ్యాటర్‌ రాబిన్‌ ఉతప్ప కొట్టగా 1000వ సిక్సర్ లివింగ్ స్టోన్ కొట్టాడు.

తాజాగా ఆదివారం జరిగిన సన్‌రైజర్స్‌-పంజాబ్‌ మ్యాచ్ తో ఈ రేర్ ఫీట్ సాధించారు. ఇంకా మ్యాచ్ లు ఉండటంతో ఈ సీజన్లో మరో 100 సిక్సర్లు అయినా రావొచ్చు అని అంచనా వేస్తున్నారు. IPL2022 లో 116 అత్యధిక సిక్సర్లతో రాజస్థాన్ రాయల్స్ ముందు వరుసలో ఉండగా, జొస్ బట్లర్ 37 సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు. సీజన్ పూర్తయ్యేసరికి ఈ గణాంకాలు కచ్చితంగా మారిపోతాయి అంటున్నారు క్రికెట్ ప్రేమికులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి