iDreamPost

మోరిస్ మోత మోగించేన్!

మోరిస్ మోత మోగించేన్!

ఐపీఎల్ అంటేనే ఫోర్లు, సిక్సుల మోతతో గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోతోంది. అయితే గత మూడు రోజులుగా ఐపీఎల్ లో భారీ స్కోర్లు నమోదు కావడం లేదు. చాలా సాదాసీదా ఆట మాత్రమే అలా అలా సాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీం చాలా స్వల్ప స్కోర్లు సాధించడం, తర్వాత వచ్చిన టీమ్ డాన్ని చేధించలేక పోవడం జరుగుతున్న నిరాశ ను రాజస్థాన్ రాయల్స్ గురువారం అద్భుత ఆటతీరుతో తీర్చేసింది. గత రెండు రోజులుగా జరిగిన తీరు గానే గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ కూడా చప్ప చప్పగా సాగుతున్నట్లు అనిపించింది. గత రెండు రోజుల మ్యాచ్ లాగానే గురువారం సైతం ఢిల్లీ స్వల్ప స్కోరు సాధించడం, దానిని చేధించలేక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆపసోపాలు పడడం కనిపించింది. అయితే చప్పగా సాగుతున్న మ్యాచ్ను చివరి శ్రేణి రాజస్థాన్ రాయల్స్ బ్యాట్ మెన్స్ మలుపు తిప్పారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 147 పరుగులు చేయగా, దాని తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ 148 రన్స్ ను ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే చేసి, అద్భుత విజయాన్ని అందుకుంది.

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చాలా స్లోగా ప్రారంభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ లు చాలా త్వరగా అవుట్ అయ్యారు. ఢిల్లీ కెప్టెన్ రిషి పంత్ మాత్రమే ఒక్కడిగా నిలిచి కొన్ని బౌండరీలు సాధించాడు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లుగానే అవుతున్నా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ మాత్రం అర్ధ సెంచరీ చేసి, పట్టుదలగా క్రీజ్లో నిలిచి ఉన్నాడు. అయితే అనుకోకుండా రనౌట్ కావడంతో 52 పరుగుల వద్ద పంత్ నిష్క్రమించాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్ మెన్లు సైతం చాలా మందకొడిగా అరెస్ట్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నోట్ 147 రన్స్ సాధారణ స్కోర్ను మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో ఒక సిక్స్ కూడా నమోదు కాకపోవడం, వారి ఆట తీరు ఎలా సాగింది అనడానికి నిదర్శనం.

148 చేయాల్సిన స్థితిలో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ బౌలర్లను ఎదుర్కోలేక పోయింది. వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొనేందుకు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ నానా అవస్థలు పడ్డారు. డేవిడ్ మిల్లర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 62 రన్స్ చేసాడు. అతడికి మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరు సహాయం అందించ లేదు. వచ్చినవారు వచ్చినట్టే అవుట్ అవ్వడం తో లక్ష్యం సాధించడం చాలా కష్టం అయింది.

రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్లు కోల్పోయి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ఆ జట్టు అపజయం దాదాపు ఖాయమైనట్లేనా అంతా భావించారు. దాదాపు 30 బాల్స్ తేడా కనిపించడం తో ఢిల్లీ విజయం చాలా సులభమే అని అనుకున్నారు. అయితే చివర్లో క్రిస్ మోరిస్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. కేవలం 18 బాల్స్ లో 36 రన్స్ చేసి రాజస్థాన్ కు చిరస్మరణీయ విజయం అందించాడు. చివరి ఓవర్లో 12 రన్స్ సాధించాలి అన్న తరుణంలో ఏకంగా రెండు సిక్సర్లు బాది ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో మొదటి మ్యాచ్లో విజయం ముంగిట వరకు వచ్చిన రాజస్థాన్ రాయల్స్, రెండో మ్యాచ్లో మాత్రం విజయపు రుచి చూసింది.

శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి