iDreamPost

పంజాబ్ భల్లే భల్లే విజయం!

పంజాబ్ భల్లే భల్లే విజయం!

వరుస విజయాల బెంగళూరు పంజాబ్ టీమ్ ముందు తేలిపోయింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ కు బెంగళూరు దాసోహం అయింది. ఓపెనర్ గా దిగిన కేఎల్ రాహుల్ చివరి వరకు నిలబడి టీమ్ కు అవసరమైన మంచి స్కోరు సాధించడం లో విజయవంతం అయ్యాడు. ఎంతో బాధ్యతగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచుతూ పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పంజాబ్ టీం ను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఓపెనర్ సింగ్ తో కలిసి బ్యాటింగ్ మొదలుపెట్టిన రాహుల్ ధాటిగా ఆడాడు. ఓపెన్ నర్సింగ్ వికెట్ కోల్పోయిన అప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తర్వాత వచ్చిన క్రిస్ గేల్ సహాయంతో పంజాబ్ స్కోరును పరుగులు పెట్టించాడు. క్రిస్ గేల్ సైతం పాత ఫామ్ అందుకని ఒకే ఓవర్ లో 5 ఫోర్లు వేయడంతో స్కోరు వేగం ఎక్స్ప్రెస్ ట్రైన్ లా పరిగెత్తింది. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి బెంగళూరు కెప్టెన్ కోహ్లి పదేపదే బౌలర్లను మారుస్తూ ప్రయోగాలు చేయడం విశేషం. చివరకు 42 వ్యక్తిగత స్కోరు వద్ద క్రిస్గేల్ కీపర్ డివిలియర్స్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ లో ఒకరి తర్వాత ఒకరు అవుతున్న సరే ఏ మాత్రం తగ్గకుండా కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన బౌండరీలతో బెంగళూరు బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. అయితే ఈ ఫ్లాటు ఓవర్లలో డెత్ ఓవర్లలో చాలా పద్ధతిగా బౌలింగ్ చేసిన బెంగళూరు బౌలర్లు, ముఖ్యంగా స్పిన్ కు అనుకూలమైన పిచ్ లో పంజాబ్ బ్యాట్స్మెన్లను అంతా కట్టడి చేశారు. అయితే చివరి ఓవర్ వేసిన హార్షల్ పటేల్ చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్లో జడేజా కు ఎంతటి స్కోర్ ఇచ్చాడో, అదే తరహాలో చివరి ఓవర్లో కె.ఎల్.రాహుల్ కు సైతం అంతే స్కోర్ ఇచ్చాడు. ఏ మాత్రం లైన్ అండ్ లెంగ్త్ పాటించకుండా డెత్ ఓవర్లలో కేవలం బాల్ విసరడానికి మాత్రమే హర్షల్ పటేల్ ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో కె.ఎల్.రాహుల్ వరుసగా ఆ ఓవర్ లో 22 రన్స్ సాధించాడు. దీంతో పంజాబ్ స్కోరు 179 రన్స్ కు చేరింది.

150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్మెన్లలు పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎంతో చక్కగా పంజాబ్ బౌలర్లు వేస్తున్న బాల్స్ కు ఏ మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. ఓపెనర్ పడిక్కాల్ వెంటనే అయిపోవడంతో, క్రీజులోకి వచ్చిన పతి దార్ వన్డే కంటే దారుణంగా బ్యాటింగ్ ఆడాడు. క్రీజ్లో కెప్టెన్ కోహ్లి ఉన్నప్పటికీ అతడు రన్స్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. 10 ఓవర్లు అయ్యేసరికి కనీసం స్కోరు 6 రన్ రేట్ కూడా లేకపోయింది. అనంతరం బౌలింగ్ చేసిన ఎడమచేతి స్పిన్నర్ సింగ్ బౌలింగ్లో వరుస వికెట్లు పడ్డాయి. కెప్టెన్ కోహ్లీ, మ్యాక్స్వెల్, ఏ బి డివిలియర్స్ వికెట్లను వరుసగా తీయడంతో సింగ్ బెంగళూరుకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అప్పటికే స్కోరు చాలా నెమ్మదించడం తోపాటు బాల్స్ చాలా తక్కువ ఉండడంతో, తర్వాత మంచి బ్యాట్స్మెన్లు ఎవరూ లేకపోవడంతో బెంగళూరు అపజయం అప్పటికే దాదాపు ఖాయమైంది. 97 రన్స్కే 7 వికెట్లు కోల్పోయిన దశలో జెమి సన్, హర్ష పటేల్ చివర్లో బ్యాట్ ఝలిపించడం తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరకు 145 రన్స్ వద్ద 20 ఓవర్లను పూర్తి చేసింది. అత్యంత స్లో ఆటతో బెంగళూరు అభిమానులకు తీవ్ర నిరుత్సాహం నింపింది.

శనివారం కూడా కీలక మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అతి పెద్ద మ్యాచ్ కోసం క్రీడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై కు చెక్ పెట్టడానికి ముంబై ఇండియన్స్ తహతహలాడుతోంది. ఖచ్చితంగా పాయింట్స్ టేబుల్ లో మెరుగైన స్థానం సాధించాలంటే చెన్నై కింగ్స్ ను ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ ఒడించల్సిన పరిస్థితి ఉంది. దీంతో శనివారం మ్యాచ్ మీద అందరి దృష్టి పడింది. రెండు బలమైన జట్లు కావడంతో ఎవరు వైపు విజయం వరిస్తుంది అన్నది వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి