iDreamPost

వార్నర్ నుంచి విలియంసన్ కు కెప్టెన్ బాధ్యతలు!

వార్నర్ నుంచి విలియంసన్ కు కెప్టెన్ బాధ్యతలు!

ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు మ్యాచులు ఆడిన హైదరాబాద్ సన్రైజర్స్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఆఖరికి ఢిల్లీతో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను తొలగించి ఆ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు బాధ్యతలు అప్పగించింది. తర్వాత మ్యాచ్ నుంచే కెప్టెన్ మార్పు ఉంటుందని ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది.

ప్రస్తుత ఐపీఎల్‌లో జట్టుకు నడిపించడంలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ విఫలమయ్యాడు అని యాజమాన్యం భావిస్తోంది. ఆరు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానాకి పడిపోయింది.  కేన్ విలియమ్సన్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌ నుండి  జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఈ మ్యాచ్ రేపే జరగనుంది.

సుమారు నాలుగు సీజనల్గా డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా సేవలు అందిస్తున్నాడు. అతడి నాయకత్వంలోనే హైదరాబాద్ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. 2016 లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ట్రోఫీని సాధించి పెట్టిన డేవిడ్ వార్నర్, అద్భుతమైన తన బ్యాటింగ్ ఫామ్‌తో జట్టుకు టైటిల్ గెలిచేలా చేశాడు. ఎన్నో మ్యాచ్లను ఓపెనర్గా దిగి చివరి వరకు మ్యాచ్ ని గెలిపించుకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఐపిఎల్ 2021 లో ఇప్పటివరకు రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై జట్టు ఓటిమితో అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 171 పరుగులతో చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 57 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే వరుస విజయాలతో సతమతం అవుతున్న హైదరాబాద్ కచ్చితంగా కెప్టెన్సీ బాధ్యతలు డేవిడ్ వార్నర్ నుంచి తొలగించి కెన్ విలియమ్స్ కు అప్ప చెప్తేనే ఫలితం ఉంటుందని భావిస్తోంది. దీంతోనే కెప్టెన్ మార్పులు చేసింది. అయితే డేవిడ్ వార్నర్ యధావిధిగా గట్టు లో కొనసాగుతానని హైదరాబాదు యాజమాన్యం ప్రకటించింది. మరోపక్క ఆస్ట్రేలియాకు కెప్టెన్ డేవిడ్ వార్నర్ వెళ్లిపోవాలని భావించడం తోనే ముందుగా కెప్టెన్ పదవి నుంచి అతని తప్పించారని తర్వాత జట్టు నుంచి కూడా తొలగించి ఆస్ట్రేలియా పంపిస్తారని ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం కెప్టెన్ మాకు పైనే ఒక ప్రెస్ నోట్ మీడియాకు విడుదల చేసింది. కేన్ విలియమ్సన్ నాయకత్వంలో హైదరాబాద్ ఎలాంటి ఆటతీరు కనబరుస్తుంది అన్నది వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి