venkateswarlu
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు మరో కీలక అడుగు వేసింది. విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా.. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా ఓ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఏపీలోని పాఠశాలల్లో ఇంటర్‌నేషనల్ బక్‌లారియేట్ (International Baccalaureate) సిలబస్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు బుధవారం ఓ కీలక ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐబీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఐబీ అధికారులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇంటర్‌నేషనల్ కరిక్కులమ్‌ను వచ్చే ఏడాది రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కేవలం 159 దేశాల్లో మాత్రమే ఈ ఐబీ సిలబస్ విధానం అందుబాటులో ఉంది. మన దేశంలో ఐబీ సిలబస్‌ను బోధించే పాఠశాలలు కేవలం 210 మాత్రమే ఉన్నాయి. కేవలం సంపన్నులు మాత్రమే అందులో చదవే అవకాశం ఉంటుంది. ఫీజులు 6 లక్షలనుంచి 20 లక్షల వరకు ఉంటాయి. మొత్తం నాలుగు దశల్లో ఐబీ ప్రోగ్రాములు ఉంటాయి.
మొదటి దశలో.. 3 నుంచి 12 సంవత్సరాలు ఉన్న విద్యార్థులకు ప్రైమరీ ఇయర్స్ ప్రొగ్రామ్ అందిస్తారు. నేర్చుకునే ఆసక్తి పెంచడం, కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్, సొంతంగా ఆలోచించే విధానం నేర్పుతారు. ఇక్కడ పరీక్షలు, గ్రేడింగ్‌లు ఉండవు. 11 నుంచి 16 సంవత్సరాల వారికి మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో ఆర్ట్స్, లాంగ్వేజ్, లాంగ్వేజ్ అక్విజిషన్, మ్యాథ్స్, డిజైన్, ఫిజికల్ ఎడ్యూకేషన్, ఇండివిడ్యువల్స్ అండ్ సొసైటీస్, సైన్సెస్‌లు ఉంటాయి. తర్వాత 16 నుంచి 19 సంవత్సరాల వారికి డిప్లొమా ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ వయసు వారికి రిలేటెడ్ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది.
విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు మన టెన్త్,ఇంటర్ సర్టిఫికేట్లు అవసరం పడవు. డిగ్రీ, పీజీల్లో యూనివర్శిటీలు వాటి కొలాబరేషన్లను చూస్తూ ఉంటారు. ఇతర దేశాలతో కూడిన చదువులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా చదివిన వారికే తొందరగా ఉద్యోగాలు వస్తాయి. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్‌నేషనల్ బక్‌లారియేట్(International Baccalaureate) సిలబస్‌ను ఏపీలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయటానికి నిర్ణయించుకుంది. దీని ద్వారా ఏపీ విద్యా విధానంలో సరికొత్త మార్పులు రానున్నాయి. మరి, ఆంధప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనున్న ఇంటర్‌నేషనల్ బక్‌లారియేట్(International Baccalaureate) సిలబస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.