iDreamPost

విశాఖలో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్.. వైరల్ వీడియో!

విశాఖలో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్.. వైరల్ వీడియో!

ఈ మధ్యకాలంలో విద్యార్థులు చదువు తప్ప.. అన్నీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ ఫ్యాన్ ఫైట్స్, సోషల్ మీడియా వార్ లో అయితే ఎంతో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. టకా టకా సెమ్ లో సిలబస్ చెప్పమంటే చెప్పలేని వాళ్లు కూడా.. తమ ఫేవరెట్ హీరో సినిమాలు, వాటి కలెక్షన్స్ వల్లె వేస్తుంటారు. ఇప్పుడు వారి ధోరణి మరీ మితిమీరోతందనే చెప్పాలి. తాజాగా వైజాగ్ లో కొందరు విద్యార్థులు చేసిన పనికి తల్లిదండ్రులు విస్తుపోయారు. ఇలా అయితే తమ పిల్లల భవిష్యత్ ఏంటి అని ఆందోళన చెందుతున్నారు.

నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. కానీ, ఈ బాలలు మాత్రం రేపటి రౌడీలు, గూండాలు అవుతారేమో అనే కంగారు పుట్టిస్తున్నారు. విశాఖ నగరంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా వీధి రౌడీల్లా కొట్టుకోవడం చూసి విశాఖ వాసులు నోరెళ్లబెట్టారు. మద్దిపాలెంలోని డాక్టర్ వీఎస్ కృష్ణా కళాశాల ఆవరణలో ఈ నిర్వాకం మొత్తం జరిగింది. ఇద్దరు విద్యార్థులతో మొదలైన గొడవ.. రెండు గ్రూపులుగా మారి కొట్టుకునే దాకా వెళ్లింది. అసలు గొడవ అంతా యూనిఫామ్ విషయంలో మొదలైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఒక విద్యార్థి యూనిఫామ్ వేసుకుని రాలేదని టీచర్ ప్రశ్నించారు. ఆ విద్యార్థి టీచర్ తో వాదనకు దిగడంతో అసలు గొడవ మొదలైంది. ఆ తర్వాత ఆ విద్యార్థిని సస్పెండ్ చేశారు.

అతను వేరే వేరే ప్రాంతాలకు చెందిన తన మిత్రులను తీసుకుని కాలేజ్ కి రావడంతో గొడవ ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ఈ విషయంపై కాలేజ్ ప్రిన్సిపాల్ పోలీసులు ఫిర్యాదు చేయగా.. గొడవకు కారణమైన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు చెబుతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. చదువుకోమని పంపిస్తే వీళ్లు చేసే పనులు ఇవా అంటూ బాధపడుతున్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ పోలీసులకు తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. ఈ మొత్తం ఘటన చూసిన నగర వాసులు.. ఒక్కొక్కళ్లకి సరిగ్గా మీసాలు కూడా రాలేదు.. ఇలా రౌడీల్లా కొట్టేసుకున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి