iDreamPost

జిమ్ చేస్తుండగా.. మెడ విరిగి స్టార్ ఫిట్ నెస్ ట్రైనర్ మృతి! వైరలవుతున్న వీడియో

  • Author Soma Sekhar Updated - 12:35 PM, Sat - 22 July 23
  • Author Soma Sekhar Updated - 12:35 PM, Sat - 22 July 23
జిమ్ చేస్తుండగా.. మెడ విరిగి స్టార్ ఫిట్ నెస్ ట్రైనర్ మృతి! వైరలవుతున్న వీడియో

ఈ మధ్య కాలంలో జిమ్ లో వర్కౌట్లు చేస్తూ.. మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలని జిమ్ లకు వెళ్తుంటారు చాలా మంది. ఫిట్ నెస్ ట్రైనర్ల సమక్షంలో వారు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత తెలిసినా కూడా చావు నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఓ స్టార్ ఫిట్ నెస్ ట్రైనర్ జిమ్ లో బరువు ఎత్తుతూ.. మెడ విరిగి మరణించాడు. అంతర్జాతీయ స్థాయిలో అతడు స్టార్ ఫిట్ నెస్ ట్రైనర్ గా, బాడీబిల్డర్ గా అతడు పేరుగాంచాడు. అతడు జిమ్ లో కుప్పకూలిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

జస్టిన్ విక్కీ(33) ఇండోనేషియాలో పేరొందిన బాడీబిల్డర్. సోషల్ మీడియలో ఫిట్ నెస్ ఇన్ ఫ్లుయెన్సర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఎంతో మందికి ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇచ్చే విక్కీ.. 33 ఏళ్ల వయసులోనే మరణించడం బాధాకరం. తాజాగా జిమ్ లో బరువు ఎత్తే క్రమంలో మెడ విరిగి విక్కీ మరణించాడు. జిమ్ లో సుమారు 400 పౌండ్ల బరువు(210కేజీలు) ఎత్తే క్రమంలో ఆ బరువును మోయలేక.. అది కస్తా మెడలపై పడటంతో.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది.

ఇక ఈ ప్రమాదాంలో మెడ విరగడంతో పాటుగా.. అతడి గుండె, లంగ్స్ నరాలు దెబ్బతిని మరణించినట్లుగా డాక్టర్లు తెలిపారు. అతిగా బరువు ఎత్తే క్రమంలో రిస్క్ ఉంటుందని, అలాంటి టైమ్ లో తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే విక్కీ మరణానికి కారణం అని వైద్యులు వివరించారు. కాగా.. జులై 15న ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచూరించాయి. రోజురోజుకు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ.. మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుతున్న దృష్ట్యా వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి