iDreamPost

క్రికెట్ లో తీవ్ర విషాదం.. స్టార్ ఆల్ రౌండర్ మృతి!

ప్రపంచ క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. 33 సంవత్సరాల స్టార్ ఆల్ రౌండర్ అకస్మాత్తుగా మరణించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. 33 సంవత్సరాల స్టార్ ఆల్ రౌండర్ అకస్మాత్తుగా మరణించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

క్రికెట్ లో తీవ్ర విషాదం.. స్టార్ ఆల్ రౌండర్ మృతి!

క్రికెట్ ప్రేమికులను ఐపీఎల్ 2024 సీజన్ ఉర్రూతలూగిస్తోంది. ఇలాంటి టైమ్ లో అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. ప్రపంచ క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. 33 సంవత్సరాల స్టార్ క్రికెటర్, ఓ జట్టుకు కెప్టెన్ అయిన కాయా అరువా మరణించారు. స్టార్ ఆల్ రౌండర్ గా, కెప్టెన్ గా పాపువా న్యూ గినియా మహిళా క్రికెట్ జట్టుకు ఎనలేని సేవ చేసింది అరువా. తాజాగా ఆమె మరణంతో టీమ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వరల్డ్ క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. పాపువా న్యూ గినియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కాయా అరువా(33) మృతి చెందింది. 2010లో క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన అరువా.. తమ టీమ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించింది. దీంతోపాటుగా 2019 టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్, 2021 వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో పాపువా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అరువా టీ20ల్లో 59 వికెట్లతో పాటుగా 341 రన్స్ కూడా చేసింది. టీ20 చరిత్రలోనే జపాన్ పై 5/7తో రెండో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చింది. అయితే ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. అరువా మరణంతో పాపువా టీమ్ లో విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సహచరులు ప్రార్థిస్తున్నారు.

ఇదికూడా చదవండి: DC vs KKR: ఆ ఓవర్‌లో పంత్ విధ్వంసం.. సెలెక్టర్స్‌కు మాస్ మెసేజ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి