iDreamPost

వీడియో: USA అంటే..? భారత క్రికెటర్లు ఏం చెప్పారో చూడండి!

  • Published Aug 12, 2023 | 1:30 PMUpdated Aug 12, 2023 | 1:30 PM
  • Published Aug 12, 2023 | 1:30 PMUpdated Aug 12, 2023 | 1:30 PM
వీడియో: USA అంటే..? భారత క్రికెటర్లు ఏం చెప్పారో చూడండి!

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా.. మూడు మ్యాచ్‌లు కరేబియన్‌ గడ్డపై ఆడిన భారత జట్టు.. మిగిలిన రెండు మ్యాచ్‌లు అమెరికాలో ఆడనుంది. ఇప్పటికే భారత్‌, వెస్టిండీస్‌ జట్లు అమెరికా చేరుకున్నాయి. అగ్రరాజ్యంలో క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఇరు బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాగా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-2తో వెనుకబడి ఉన్న విషయం తెలిసిందే. మిగిలి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే కానీ, సిరీస్ గెలవడం అసాధ్యం. వెస్టిండీస్‌ ఒక్క మ్యాచ్‌ గెలిచినా సిరీస్‌ వారిదే. యువ టీమిండియాకు ఇదో పెద్ద సవాల్‌గా మారింది. ఈ రోజు(శనివారం) జరగనున్న నాలుగో మ్యాచ్‌తో సిరీస్‌లో స్పష్టత రానుంది. టీమిండియా గెలిస్తే.. సిరీస్‌ సమం అవుతుంది. చివరి మ్యాచ్‌ సిరీస్‌ డిసైడర్‌గా మారుతుంది.

సిరీస్‌ గెలుపోటములను కాసేపు అలా ఉంచితే.. అమెరికాలో మ్యాచ్‌లు ఆడేందుకు అడుగుపెట్టిన టీమిండియా క్రికెటర్లను ‘యూఎస్‌ఏ(యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా)’ అంటే మీ మైండ్‌లో ముందుగా ఏం గుర్తుకు వస్తుందని, బీసీసీఐ ఓ వీడియోను చేసింది. ఇందులో పలువురు భారత క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తొలుత టీమిండియా టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందిస్తూ.. యూఎస్‌ఏ అంటే చాలా మంది డ్రీమ్‌ అని అన్నాడు. అంటే ఎంతో మంది అమెరికా వెళ్లాలని, అక్కడ ఉద్యోగం చేయాలని, స్థిరపడాలని అనుకుంటారనే ఉద్దేశంలో పాండ్యా చెప్పాడు. ఇక యువ క్రికెటర్‌ ముఖేష్‌ కుమార్‌ అయితే.. తనకు అమెరికా అనే చాలా కాలంగా తెలుసని, యూఎస్‌ఏ అంటే అమెరికా అని ఈ మధ్యనే తెలిసిందని అన్నాడు.

మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అయితే.. యూఎస్‌ఏ అనగానే తనకు ఐస్‌ క్రీమ్స్‌ గుర్తు వస్తాయని, ఇప్పుడు నేను తినలేకపోతున్నా.. నాకు అవే గుర్తుకు వస్తాయని అన్నాడు. ఇక మన తెలుగు తేజం తిలక్‌ వర్మ స్పందిస్తూ.. యూఎస్‌ఏ అంటే క్రికెట్‌ మైదానాలు బేస్‌ బాల్‌ గ్రౌండ్స్‌లా ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారని, తొలి సారి ఇక్కడ ఆడుతున్న క్రమంలో అవి ఎలా ఉంటాయో చూడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. శుబ్‌మన్‌ గిల్‌ అయితే తమ బంధువులు చాలా మంది ఇక్కడే ఉన్నారని, యూఎస్‌ఏ అనగానే తనకు చుట్టాలు గుర్తుకు వస్తారని అన్నాడు. మిగతా క్రికెటర్లు అమెరికాలోని కొన్ని ఫేమస్‌ ప్రాంతాలు, షాపింగ్‌ ఇలా పలు సమాధానాలు చెప్పారు. కిందున్న వీడియో చూసి ఎవరూ ఏం చెప్పారో చూడండి. అలాగే ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఒక్క ఇన్‌స్టా పోస్టుకు రూ.11 కోట్లకు పైనే..! భారీ ట్విస్ట్‌ ఇచ్చిన కోహ్లీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి