iDreamPost

ప్రపంచకప్ లో సెమీస్ కు చేరిన భారత్

ప్రపంచకప్ లో సెమీస్ కు చేరిన భారత్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో మరో అద్భుత విజయాన్ని పటిష్ట కివీస్ పై నమోదు చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. తాజా వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా భారత్‌ నిలిచింది.

సమిష్టిగా రాణించిన భారత జట్టు చివరిబంతికి విజయం సాధించింది. చివర్లో అమేలియా కెర్(34,6 ఫోర్లు) భారీ షాట్లతో భయపెట్టినా, విజయం మాత్రం భారత జట్టునే వరించింది. చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు అవసరమైన స్థితిలో అమేలియా కెర్ ఎదురుదాడికి దిగి నాలుగు ఫోర్లు సాధించడంతో 19 వ ఓవర్లో 18 పరుగులు లభించాయి.

చివరి ఓవర్లో విజయానికి కివీస్ జట్టుకు 16 పరుగులు అవసరం కాగా 11 పరుగులే సాధించడంతో నాలుగు పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించి సెమీఫైనల్ లో అడుగుపెట్టింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు షెఫాలీ వర్మ(46) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగుల స్వల్ప స్కోరు సాధించింది. అమేలియా కెర్ బౌలింగ్ లో కూడా రాణించి రెండు వికెట్లు దక్కించుకోగా రోజ్ మేరీ మైర్ రెండు వికెట్లు సాధించింది. కాగా న్యూజిలాండ్ లక్ష్య ఛేదనలో 129 పరుగులకే పరిమితమయింది. భారత బౌలర్లలో శిఖ పాండే, పూనమ్ యాదవ్ , రాజేశ్వరి గైక్వాడ్,రాధ యాదవ్, దీప్తి శర్మ తలో వికెట్ సాధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి