iDreamPost

VIDEO: వావ్‌.. ఇది కదా సిక్స్‌ అంటే! వరల్డ్‌ కప్‌లోనే భారీ సిక్స్‌

  • Author singhj Published - 05:30 PM, Thu - 2 November 23

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కొట్టిన ఓ సిక్స్ హైలైట్​గా నిలిచింది. ఇది కదా సిక్స్ అనేలా ఆ షాట్ అనిపించింది. అయ్యర్ షాట్ చూసి లంక ప్లేయర్లు షాకయ్యారు.

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కొట్టిన ఓ సిక్స్ హైలైట్​గా నిలిచింది. ఇది కదా సిక్స్ అనేలా ఆ షాట్ అనిపించింది. అయ్యర్ షాట్ చూసి లంక ప్లేయర్లు షాకయ్యారు.

  • Author singhj Published - 05:30 PM, Thu - 2 November 23
VIDEO: వావ్‌.. ఇది కదా సిక్స్‌ అంటే! వరల్డ్‌ కప్‌లోనే భారీ సిక్స్‌

వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో టీమిండియా అదరగొడుతోంది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగింది రోహిత్ సేన. అయితే టీమ్​కు మంచి స్టార్ట్ లభించలేదు. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (4) రెండు బంతులు ఆడి పెవిలియన్​కు చేరాడు. అయితే ఫస్ట్​ డౌన్​లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (88).. శుబ్​మన్ గిల్ (92)తో కలసి సూపర్బ్ పార్ట్​నర్​షిప్​ను నమోదు చేశాడు. వీళ్లిద్దరూ కలసి రెండో వికెట్​కు ఏకంగా 189 పరులు జోడించారు. అయితే దురదృష్టవశాత్తూ ఒక్కరు కూడా సెంచరీ మార్క్​ను చేరుకోలేకపోయారు. గిల్ 92 రన్స్ చేసి ఔటవ్వగా.. కోహ్లీ 88 రన్స్ చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. ఒకవేళ లంకతో మ్యాచ్​లో మూడంకెల స్కోరు చేసి ఉంటే విరాట్ కోహ్లీ కెరీర్​లో ఇది 49వ సెంచరీ అయ్యేది.

సచిన్ టెండూల్కర్ అడ్డా అయిన ముంబైలోని వాంఖడేలో అతడి సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేసేవాడు. కానీ కోహ్లీ ఆ ఫీట్​ను అందుకోలేకపోయాడు. కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (45 నాటౌట్) మంచి నాక్ ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ (21)తో కలసి ఎడాపెడా షాట్స్ కొడుతూ స్కోరు బోర్డును బుల్లెట్ స్పీడ్​తో పరిగెత్తించాడు. ఈ క్రమంలో అయ్యర్ ఓ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. ఆ బాల్ కాస్తా 106 మీటర్ల దూరం వెళ్లింది. ఈ వరల్డ్ కప్​లో ఇదే బిగ్గెస్ట్ సిక్సర్ కావడం విశేషం. ఇది కదా సిక్స్ అనేలా అయ్యర్ షాట్ అనిపించింది. భారీ సిక్సర్ల విషయంలో శ్రేయస్ తర్వాతి స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్​వెల్ (101 మీటర్లు), ఫఖర్ జమాన్ (99 మీటర్లు), డేవిడ్ వార్నర్ (98 మీటర్లు) ఉన్నారు. మరి.. అయ్యర్ సిక్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: కోహ్లీ సూపర్‌ షాట్‌! రోహిత్‌ శర్మ రియాక్షన్‌ చూడండి!

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి