iDreamPost

IND vs SA: వీడియో: ఫైనల్ టెస్ట్ ఆడుతున్న ఎల్గర్​కు షాక్.. సిరాజ్​తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది!

  • Published Jan 03, 2024 | 3:15 PMUpdated Jan 03, 2024 | 3:15 PM

సెకండ్ టెస్ట్​లో సౌతాఫ్రికా బ్యాటర్లను భారత స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్ పోయిస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్​కు సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్​కు మైండ్ బ్లాంక్ అయింది.

సెకండ్ టెస్ట్​లో సౌతాఫ్రికా బ్యాటర్లను భారత స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్ పోయిస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్​కు సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్​కు మైండ్ బ్లాంక్ అయింది.

  • Published Jan 03, 2024 | 3:15 PMUpdated Jan 03, 2024 | 3:15 PM
IND vs SA: వీడియో: ఫైనల్ టెస్ట్ ఆడుతున్న ఎల్గర్​కు షాక్.. సిరాజ్​తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది!

సౌతాఫ్రికాతో తొలి టెస్ట్​లో ఇన్నింగ్స్ ఓటమి ఎదురైన నేపథ్యంలో ఆఖరి మ్యాచ్​లో టీమిండియా ఎలా ఆడుతుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఇది రోహిత్ సేనకు రియల్ టెస్ట్​గా మారింది. అయితే ఈ ఛాలెంజ్​ను స్వీకరించిన భారత్.. రెండో టెస్ట్​లో అదరగొడుతోంది. ఈ మ్యాచ్​లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ ప్లేస్​లో ముకేశ్ కుమార్​ను తీసుకుంది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాను గ్రౌండ్​లోకి దింపింది. తొలి మ్యాచ్​లో ఫెయిలైన యంగ్ పేసర్​ ప్రసిద్ధ్​ కృష్ణపై టీమ్ మేనేజ్​మెంట్ నమ్మకం ఉంచి మరో ఛాన్స్ ఇచ్చింది. రెండో టెస్ట్​లో టాస్ నెగ్గిన ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్​కు దిగింది. అయితే ఆ టీమ్​ను మహ్మద్ సిరాజ్ ముప్పుతిప్పలు పెడుతున్నాడు.

కెరీర్​లో ఆఖరి టెస్ట్ ఆడుతున్న సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్​కు సిరాజ్ మియా షాకిచ్చాడు. అతడికి వరుసగా డాట్ బాల్స్ వేస్తూ ఓపికను టెస్ట్ చేశాడు. చెత్త బంతులు వేయకుండా షాట్స్ కోసం ఎక్స్​ట్రా ఎఫర్ట్ పెట్టేలా ఎల్గర్​ను పుష్ చేశాడు. దీంతో సిరాజ్ వేసిన ఓ బాల్ దూరంగా వెళ్తుండగా దాన్ని వికెట్ల మీదకు ఆడుకొని ఔటయ్యాడు ఎల్గర్. ఫస్ట్ టెస్ట్​లో సెంచరీతో దుమ్మురేపిన ఎల్గర్​ను ప్లాన్ ప్రకారం డాట్ బాల్స్​తో మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాడు. అతడి కంటే ముందు ఎయిడెన్ మార్క్​రమ్​ను గుడ్​ లెంగ్త్​ బంతితో ఔట్ చేశాడు సిరాజ్. లెంగ్త్​లో పడి ఒక్కసారిగా బౌన్స్ అయిన బంతిని ఏం చేయాలో తెలియక బ్యాట్ అడ్డుగా పెట్టాడు. అంతే ఎడ్జ్ తీసుకున్న బంతి కాస్తా స్లిప్స్​లోకి వెళ్లడం.. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డైవ్ చేసి పట్టుకోవడం రెప్పపాటులో జరిగిపోయాయి. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చారు టోనీ జార్జి (2), ట్రిస్టాన్ స్టబ్స్ (3).

జార్జి, స్టబ్స్​కు ఇన్నింగ్స్​ను బిల్డ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు భారత పేసర్లు. సిరాజ్ బౌలింగ్​లో కీపర్ కేఎల్ రాహుల్​కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్​కు చేరుకున్నాడు జార్జి. మరో బ్యాటర్ స్టబ్స్​.. జస్​ప్రీత్ బుమ్రా బౌలింగ్​లో ఔటయ్యాడు. దీంతో 15 పరుగులకే నలుగురు టాపార్డర్ బ్యాటర్లు ఔటవడంతో ప్రొటీస్ దిక్కుతోచని స్థితిలో పడింది. పిచ్ నుంచి పేస్, స్వింగ్​కు మంచి మద్దతు ఉండటంతో సిరాజ్, బుమ్రా రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. ముఖ్యంగా హైదరాబాదీ సిరాజ్ లైన్ అండ్ లెంగ్త్ పట్టుకొని కన్​సిస్టెంట్​గా ఒకే ఏరియాలో బాల్స్​ను హిట్ చేశాడు. అతడి డిసిప్లిన్ వర్కౌట్ కావడంతో టపటపా వికెట్లు పడ్డాయి. సిరాజ్​కు తోడుగా మిగతా బౌలర్లు కూడా పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​లో బౌలింగ్​ చేస్తే సౌతాఫ్రికాను 100 రన్స్​ లోపు ఆలౌట్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్​లో సిరాజ్ బౌలింగ్​ చేస్తున్న తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇలాంటి బౌలింగ్ అతడికే సాధ్యమని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సిరాజ్ బౌలింగ్​ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: David Warner: చివరి టెస్టుకి ముందు వార్నర్ ఎమోషనల్.. ఇందుకే నువ్వు మాకు నచ్చేది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి