iDreamPost

World Cup: కసితో బౌలింగ్ చేస్తున్న షమి.. వేసిన ఫస్ట్ బాల్​కే..!

  • Author singhj Published - 03:45 PM, Sun - 22 October 23

ఫైనల్ ఎలెవన్​లో ప్లేస్ దక్కక ఇబ్బంది పడుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి ఎట్టకేలకు న్యూజిలాండ్​తో మ్యాచ్​లో ఛాన్స్ దక్కింది. దాన్ని అతడు పూర్తి సద్వినియోగం చేసుకుంటున్నాడు.

ఫైనల్ ఎలెవన్​లో ప్లేస్ దక్కక ఇబ్బంది పడుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి ఎట్టకేలకు న్యూజిలాండ్​తో మ్యాచ్​లో ఛాన్స్ దక్కింది. దాన్ని అతడు పూర్తి సద్వినియోగం చేసుకుంటున్నాడు.

  • Author singhj Published - 03:45 PM, Sun - 22 October 23
World Cup: కసితో బౌలింగ్ చేస్తున్న షమి.. వేసిన ఫస్ట్ బాల్​కే..!

వన్డే వరల్డ్ కప్​-2023లో బాగా ఆసక్తి రేకెత్తించిన మ్యాచుల్లో ఒకటి భారత్-న్యూజిలాండ్ మ్యాచ్. ఓటమనేదే లేకుండా మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ టీమ్స్ మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు వచ్చేసింది. ఆదివారం ధర్మశాల వేదికగా ఈ ఇరు టీమ్స్ మధ్య మ్యాచ్ మొదలైపోయింది. టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఛేజింగ్​కు మొగ్గు చూపాడు. దీంతో కివీస్ తొలుత బ్యాటింగ్​కు దిగాల్సి వచ్చింది. ఈ మ్యాచ్​లో టీమ్ విషయంలో రెండు మార్పులు చేసింది భారత మేనేజ్​మెంట్. గాయపడిన హార్దిక్ పాండ్యా ప్లేసులో సూర్యకుమార్ యాదవ్​ను తీసుకుంది. అలాగే శార్దూల్ ఠాకూర్ స్థానంలో వెటరన్ పేసర్ మహ్మద్ షమీని తీసుకుంది.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్​కు మంచి ఆరంభం దక్కలేదు. కివీస్ ఓపెనర్లు డెవిన్ కాన్వే, విల్ యంగ్​లను భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్​ప్రీత్ బుమ్రాలు కట్టిపడేశారు. రన్స్ రాకుండా నిలువరించడంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఈ క్రమంలో మమ్మద్ సిరాజ్ వేసిన బంతికి శ్రేయస్ అయ్యర్​కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు కాన్వే. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన మరో ఓపెనర్ విల్ యంగ్​ను షమి పెవిలియన్​కు పంపాడు. స్కోరు బోర్డు మీద 20 రన్స్ కూడా చేరకుండానే కివీస్​ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

వరల్డ్ కప్​లో ఛాన్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి న్యూజిలాండ్​తో మ్యాచ్​లో ఛాన్స్ దక్కింది. దాన్ని అతడు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఎనిమిదో ఓవర్​లో బౌలింగ్​కు దిగిన షమి.. తాను వేసిన ఫస్ట్ బాల్​కే విల్ యంగ్​ను ఔట్ చేశాడు. స్వింగ్ అవుతూ వచ్చిన బాల్​ను ఆడటంలో యంగ్ ఫెయిలై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న షమి.. ఈ మ్యాచ్​లో తనకు వచ్చి ఛాన్స్​ను పూర్తిగా వాడుకుంటున్నాడు. కసితో బౌలింగ్ చేస్తున్నాడు. కివీస్ బ్యాటర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా రన్స్ నిలువరిస్తూ ఒత్తిడి పెంచుతున్నాడు. షమి తీసిన వికెట్ చూసిన ఫ్యాన్స్ అతడు బౌలింగ్ వేస్తే ఇలాగే ఉంటుందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ మ్యాచ్​లో షమి బౌలింగ్ వేస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కివీస్​తో మ్యాచ్​కు ముందు ICCపై ద్రవిడ్ సీరియస్.. అది కరెక్ట్ కాదంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి