iDreamPost

Virat Kohli: ఇంగ్లండ్​తో సిరీస్​ నుంచి తప్పుకున్న కోహ్లీ! కారణం ఏంటంటే..?

  • Published Feb 10, 2024 | 2:13 PMUpdated Feb 10, 2024 | 2:13 PM

ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడతాడా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. అయితే తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.

ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడతాడా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. అయితే తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.

  • Published Feb 10, 2024 | 2:13 PMUpdated Feb 10, 2024 | 2:13 PM
Virat Kohli: ఇంగ్లండ్​తో సిరీస్​ నుంచి తప్పుకున్న కోహ్లీ! కారణం ఏంటంటే..?

ఇంగ్లండ్​తో మొదటి రెండు టెస్టులు ముగియడంతో మూడో మ్యాచ్​పై టీమిండియా ఫోకస్ పెడుతోంది. ఉప్పల్ ఆతిథ్యం ఇచ్చిన మొదటి టెస్టులో ఇంగ్లీష్ టీమ్ నెగ్గగా.. వైజాగ్​లో రోహిత్ సేనను విజయం వరించింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. రాజ్​కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. అయితే మిగిలిన మూడు మ్యాచులకు సంబంధించిన టీమ్ సెలక్షన్ ఆలస్యమైంది. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కమ్​బ్యాక్ ఇస్తాడా? గాయంతో రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగొస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి దీనిపై క్లారిటీ వచ్చేసింది. మిగిలిన మూడు టెస్టు మ్యాచులకు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అనుకున్నట్లుగానే కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంజ్యురీ కారణంగా రెండో టెస్టుకు దూరమైన జడేజా, రాహుల్ తిరిగి టీమ్​లోకి వచ్చారు.

ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా మిగతా టెస్టులకు వచ్చేశాడు. కొత్తగా ఆకాశ్ దీప్ కూడా టెస్టు టీమ్​కు సెలక్ట్ అయ్యాడు. రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇంజ్యురీతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్​ను ఎంపిక చేయలేదు. ఇషాన్ కిషన్​తో పాటు మహ్మద్ షమీని పరిగణనలోకి తీసుకోలేదు. సెకండ్ టెస్టు స్క్వాడ్​లో ఉన్న అవేశ్ ఖాన్, సౌరభ్ కుమార్​ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ సందర్భంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఆసక్తికర కామెంట్ చేసింది. పర్సనల్ రీజన్స్​తో టెస్టు సిరీస్​కు అతడు దూరమయ్యాడని తెలిపింది. కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని వెల్లడించింది. రాహుల్, జడేజా విషయంలోనూ తొందరపాటు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది.

రాజ్​కోట్ టెస్టు నాటికి క్లియరెన్స్ వస్తేనే జడేజా, రాహుల్​ను తుదిజట్టులో ఆడించే అవకాశాలు ఉంటాయని తెలిపింది బీసీసీఐ. ఈ మేరకు బీసీసీఐ డాక్టర్ల బృందం నుంచి రిపోర్టులు రావాల్సి ఉందని స్పష్టం చేసింది. అయితే కోహ్లీ కమ్​బ్యాక్ ఇస్తాడని అనుకుంటే సిరీస్ మొత్తానికి దూరమవడంపై అతడి అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జేమ్స్ అండర్సన్ లాంటి బౌలర్​తో కోహ్లీ కౌంటర్ చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తే.. చివరికి నిరాశే మిగిలిందని కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తామని.. తన అవసరం కుటుంబానికి ఉంది కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడని చెబుతున్నారు. ఇక, సిరీస్​లోని మూడో టెస్టు రాజ్​కోట్​ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలవనుంది. నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో, ఐదో మ్యాచ్ మార్చి 7న ధర్మశాలలో ప్రారంభం కానున్నాయి. మరి.. ఇంగ్లండ్​తో సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి