Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరో ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో తన తడాఖా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సిరీస్‌కు ముందు అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరో ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో తన తడాఖా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సిరీస్‌కు ముందు అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ ముగింపునకు చేరుకుంది. ఇంకో మ్యాచ్ ఆడితే ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న టీమిండియా.. ఆఖరి టీ20లోనూ నెగ్గి ప్రత్యర్థిని వైట్‌వాష్ చేయాలని చూస్తోంది. ఈ సిరీస్ అయిపోయిన వెంటనే ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది రోహిత్ సేన. దీనికి సంబంధించి ఇప్పటికే 16 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ప్రకటించారు. మొదటి రెండు టెస్టులకు మాత్రమే స్క్వాడ్‌ను అనౌన్స్ చేశారు. తర్వాతి రెండు మ్యాచుల్లో ఆడే జట్టును ఇంకా ప్రకటించలేదు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో బరిలోకి దిగే టీమ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఊరికే వచ్చిందేదీ తనకు అక్కర్లేదన్నాడు. తనకు సవాళ్లు అంటే ఎంతో ఇష్టమన్నాడు. ఛాలెంజ్ ఉన్నప్పుడే బెస్ట్ ఇవ్వగలమన్నాడు అయ్యర్.
రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగాడు అయ్యర్. ఈ మ్యాచ్‌లో ముంబై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అనంతరం ఈ టీమిండియా స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను వర్తమానంలో ఉండేందుకే ఇష్టపడతానన్నాడు. ఆంధ్రాతో మ్యాచ్‌లో ఆడాలని తనకు చెప్పారని.. తన పని పూర్తయిందన్నాడు. ఈ మ్యాచ్‌లో తాను ఆడిన తీరుతో సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు అయ్యర్. తన చేతిలో లేని విషయాల గురించి అస్సలు ఆలోచించనని స్పష్టం చేశాడు. వచ్చి మ్యాచ్ ఆడి టీమ్‌ను గెలిపించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ పైనా రియాక్ట్ అయ్యాడు అయ్యర్. ఆ సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌ను విడిగా చూడాలని తెలిపాడు. మొదటి రెండు మ్యాచులకే స్క్వాడ్‌ను ప్రకటించారని పేర్కొన్నాడు.
‘ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచులకు మాత్రమే జట్టును ప్రకటించారు. మొత్తం సిరీస్ గురించి ఆలోచించి టెన్షన్ పడకుండా ప్రతి మ్యాచ్‌ను విడివిడిగా చూడాలి. మొదటి రెండు టెస్టుల్లో సత్తా చాటడమే ఇప్పుడు నా కర్తవ్యం. అదే పెర్ఫార్మెన్స్ను మిగిలిన సిరీస్ మొత్తం కంటిన్యూ చేయాలి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టర్నింగ్ వికెట్లలో ఆడాల్సి ఉంటుందని అనుకుంటున్నా. అయితే నేను మాత్రం నా ఫిట్నెస్, క్రీజులో పాతుకుపోవడం, సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం మీదే ఫోకస్ చేస్తున్నా. గాయం తర్వాత ఔట్‌ఫీల్డ్‌లో ఎక్కువ సేపు ఉండటం టఫ్‌గా మారింది. కాబట్టి దీన్ని మంచి ప్రాక్టీస్‌గా భావిస్తున్నా. ఈ సిరీస్‌ను ఉపయోగించుకుంటా. నాకు కాంపిటీషన్ అంటే చాలా ఇష్టం. ఛాలెంజ్ ఎదురైనప్పుడే మన బెస్ట్ ఇవ్వగలం. ఆ టైమ్‌లోనే మన టాలెంట్, స్కిల్స్ బయటపడతాయి’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. మరి.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్! రోహిత్ వైఫల్యానికి కారణం అదేనా?
Shreyas Iyer said, “when competition is there and you face more challenges, that’s what I thrive on personally. I love competitions”. pic.twitter.com/2gKAwbh5JG
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 16, 2024