iDreamPost

IND vs ENG: ఈ గెలుపులో భారత్ గొప్పేమీ లేదు.. ఇంగ్లండ్ తన గోతిని తానే తీసుకుంది!

  • Published Feb 06, 2024 | 9:00 PMUpdated Feb 06, 2024 | 9:00 PM

వైజాగ్ టెస్టులో భారత్ 106 పరుగులు తేడాతో ఇంగ్లండ్​ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్ తన గోతిని తానే తీసుకుందని.. అందుకే ఓడిందన్నాడు ఓ మాజీ క్రికెటర్.

వైజాగ్ టెస్టులో భారత్ 106 పరుగులు తేడాతో ఇంగ్లండ్​ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్ తన గోతిని తానే తీసుకుందని.. అందుకే ఓడిందన్నాడు ఓ మాజీ క్రికెటర్.

  • Published Feb 06, 2024 | 9:00 PMUpdated Feb 06, 2024 | 9:00 PM
IND vs ENG: ఈ గెలుపులో భారత్ గొప్పేమీ లేదు.. ఇంగ్లండ్ తన గోతిని తానే తీసుకుంది!

బజ్​బాల్​ క్రికెట్​ అంటూ భారత్​ను భయపెట్టిన ఇంగ్లండ్ చావుదెబ్బ తిన్నది. వైజాగ్ టెస్టులో రోహిత్ సేన చేతిలో 106 పరుగుల తేడాతో చిత్తయింది. ఉప్పల్​లో జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లీష్ టీమ్.. రెండో మ్యాచులో అదే మ్యాజిక్​ను రిపీట్ చేయలేకపోయింది. ఇంగ్లండ్ దూకుడుకు యంగ్​ బ్యాటర్స్ యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్​తో పాటు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా కళ్లెం వేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో జైస్వాల్ డబుల్ సెంచరీ బాదగా.. సెకండ్ ఇన్నింగ్స్​లో గిల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్​లో 9 వికెట్లు తీసిన బుమ్రా.. ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అయితే వైజాగ్ టెస్టులో దక్కిన విజయంలో టీమిండియా గొప్పదనం పెద్దగా లేదని.. ఇంగ్లండ్ తన గోతిని తాను తీసుకోవడం వల్ల ఓడిందన్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

బ్యాటర్లు చెత్త షాట్లు ఆడటం వల్లే ఇంగ్లండ్ ఓడిపోయిందన్నాడు ఆకాశ్ చోప్రా. ఈ మ్యాచ్​లో భారత్ అద్భుతంగా ఆడిందని.. అయితే ఇంగ్లండ్ తన గోతిని తానే తవ్వుకొని ఓడిందన్నాడు. కీలక బ్యాట్స్​మన్ జో రూట్ రాంగ్ టైమ్​లో చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడని ఆకాశ్ చోప్రా చెప్పాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అనవసర రన్​కు ప్రయత్నించి రనౌట్​ అయి పెవిలియన్​కు చేరుకున్నాడని తెలిపాడు. ‘ఇంగ్లండ్ బ్యాటర్లు వాళ్లు చేసిన తప్పులను సమీక్షించుకోవాలి. రూట్ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. స్టోక్స్ అలా పరిగెత్తడం ఏంటో అర్థం కాలేదు. పరుగులు చేయడానికి తొందర ఎందుకు? మ్యాచ్​లో ఇంకో రోజు కూడా ఉంది. కావాలంటే ఐదో రోజు కూడా పరుగులు బాది గెలవొచ్చు. అనవసర రన్​కు ప్రయత్నించి స్టోక్స్ వికెట్ అప్పగించాడు. ఆ పిచ్​పై 10 వికెట్లు తీయడం అంత ఈజీ కాదు’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

రనౌట్ విషయంలో స్టోక్స్​దే తప్పన్నాడు ఆకాశ్ చోప్రా. అతడు పరుగు పూర్తి చేయడంలో బద్దకించడం ఇంగ్లండ్ కొంప ముంచిందన్నాడు. రన్​ కోసం బెన్ ఫోక్స్ వెంటనే పిలిచాడని.. కానీ స్టోక్స్ ఆలస్యంగా స్పందించడం వల్లే ఔటయ్యాడని తెలిపాడు. ఇంగ్లండ్ క్రికెటర్లు ఇలా చెత్తాట ఆడటం వల్ల భారత్ పని సులువైందన్నాడు ఆకాశ్ చోప్రా. రూట్, స్టోక్స్ లాంటి వాళ్లు తప్పులు చేయడంతో ఇంగ్లీష్ టీమ్​ను ఆలౌట్ చేయడం రోహిత్ సేనకు ఈజీ అయిందన్నాడు. అందుకు ఇంగ్లండ్ ప్లేయర్లకు థ్యాంక్స్ చెప్పాల్సిందేనని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇక, 5 టెస్టుల ఈ సిరీస్​లో మూడో మ్యాచ్ రాజ్​కోట్​లో జరగనుంది. అందుకోసం నిరంజన్ షా స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. మరి.. రూట్, స్టోక్స్ తప్పిదాల వల్ల భారత్ గెలుపు మరింత ఈజీ అయిందంటూ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి