iDreamPost

Ravindra Jadeja: పేరుకే ఆల్​రౌండర్ అంటూ విమర్శలు.. అందరి నోళ్లు మూయించిన జడ్డూ!

  • Published Jan 27, 2024 | 11:50 AMUpdated Jan 27, 2024 | 11:50 AM

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా వాళ్లకు ఓ రేంజ్​లో ఇచ్చిపడేశాడు. పేరుకే ఆల్​రౌండర్ అంటూ తనను విమర్శించిన వారి నోళ్లు మూయించాడు.

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా వాళ్లకు ఓ రేంజ్​లో ఇచ్చిపడేశాడు. పేరుకే ఆల్​రౌండర్ అంటూ తనను విమర్శించిన వారి నోళ్లు మూయించాడు.

  • Published Jan 27, 2024 | 11:50 AMUpdated Jan 27, 2024 | 11:50 AM
Ravindra Jadeja: పేరుకే ఆల్​రౌండర్ అంటూ విమర్శలు.. అందరి నోళ్లు మూయించిన జడ్డూ!

క్రికెట్​లో ఏ టీమ్ అయినా ఆల్​రౌండర్లు కావాలని కోరుకుంటుంది. వాళ్లు జట్టులో ఉంటే అటు బ్యాటింగ్​తోపాటు ఇటు బౌలింగ్​లోనూ పనికొస్తారు. ఎఫెక్టివ్ ఆల్​రౌండర్స్ వల్ల టీమ్ కాంబినేషన్​లో మంచి బ్యాలెన్స్ వస్తుంది. అందుకే అన్ని జట్లు ఆల్​రౌండర్ల కోసం అన్వేషిస్తుంటాయి. ఒకవేళ ఎవరూ దొరక్కపోతే అందుబాటులో ఉన్నవారిలో బ్యాటింగ్​తో పాటు బౌలింగ్ చేయగలిగే వారిని ఆ రోల్ కోసం ప్రిపేర్ చేస్తుంటాయి. ప్రస్తుత తరంలో బెస్ట్ ఆల్​రౌండర్లు అనదగ్గ వారిలో టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా ఒకడు. బాల్​తో ప్రత్యర్థుల పతనాన్ని శాసించే అతడు.. బ్యాట్​తో అవసరమైనప్పుడు గర్జిస్తాడు. అందుకే మూడు ఫార్మాట్లలోనూ టీమ్​లో కీలక ప్లేయర్​గా మారాడు. అయితే గత కొన్నాళ్లుగా బ్యాటింగ్​లో ఫెయిలవుతున్నాడు జడ్డూ. బాల్​తో రాణించినా బ్యాట్​తో సత్తా చాటలేకపోవడంతో అన్ని వైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. కానీ వాటికి ఒక్క ఇన్నింగ్స్​తో చెక్ పెట్టేశాడు జడ్డూ.

పేరుకే ఆల్​రౌండర్ అంటూ జడేజాపై ఈ మధ్య కొందరు విమర్శలు గుప్పించారు. వికెట్లు తీస్తున్నాడు తప్పితే బ్యాటింగ్​లో తడబడుతున్నాడని.. అతడ్ని తీసేయాలంటూ డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే తనపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఓపికగా చూస్తూ వచ్చిన జడ్డూ ఒకే ఇన్నింగ్స్​తో వాళ్లందరికీ గట్టిగా ఇచ్చిపడేశాడు. ఇంగ్లండ్​తో తొలి టెస్ట్​లో 87 పరుగుల విలువైన ఇన్నింగ్స్​ ఆడి తానెంత విలువైన ప్లేయరో మరోమారు ప్రూవ్ చేశాడు. శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్​తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి టీమ్​కు భారీ లీడ్ అందించాడు. ఈ మ్యాచ్​లో టీమిండియా 190 పరుగుల ఆధిక్యం సాధించిందంటే అందులో జడ్డూ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. కేఎల్ రాహుల్ (86) ఔట్ అవడంతో మిడిల్, లోయరార్డర్​ను కూల్చేద్దామని అనుకున్న ఇంగ్లీష్ టీమ్​కు చుక్కలు చూపించాడు జడ్డూ. ఓపికగా ఆడుతూ క్రీజులో నిలిచిన అతడు చెత్త బంతుల్ని మాత్రమే బౌండరీలకు తరలించాడు.

jadeja superb batting

కేఎస్ భరత్​తో కలసి ఆరో వికెట్​కు 68 పరుగులు జోడించాడు జడ్డూ. ఆ తర్వాత భరత్ ఔటైనా తాను మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఒక ఎండ్​లో తాను గట్టిగా నిలబడటంతో తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ (44) స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. వీళ్లిద్దరూ కలసి 78 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 400 దాటిందంటే అది జడ్డూ మెచ్యూర్డ్ బ్యాటింగ్ వల్లేనని చెప్పాలి. వికెట్లు పడుతున్నాయని అడ్డగోలు షాట్స్ ఆడకుండా క్రీజులో నిలదొక్కుకోవడం మీదే అతడు కాన్​సంట్రేట్ చేశాడు. సెటిలైతే రన్స్ అవే వస్తాయని అర్థం చేసుకున్నాడు. సింగిల్స్, డబుల్స్​తో స్ట్రయిక్ రొటేషన్​కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగకుండా అక్షర్​ను హిట్టింగ్ చేయమన్నాడు. ఈ స్ట్రాటజీ వర్కౌట్ కావడంతో ప్రత్యర్థి జట్టు డిఫెన్స్​లో పడింది. ఈ ఒక్క ఇన్నింగ్స్​తో తన బ్యాటింగ్​ను సందేహించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పాడు జడ్డూ. తనను విమర్శించిన వారి నోళ్లు మూయించాడు. తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు. మరి.. ఇంగ్లండ్​పై జడ్డూ ఆడిన ఇన్నింగ్స్​ గురించి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి