iDreamPost

అండర్సన్ క్యాచ్​కు ఫిదా అవ్వాల్సిందే! 41 ఏళ్ల వయసులోనూ పక్షిలా ఎగురుతూ..

  • Published Feb 26, 2024 | 12:26 PMUpdated Feb 26, 2024 | 12:26 PM

ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అండర్సన్ బౌలింగ్​లోనే కాదు.. ఫీల్డింగ్​లోనూ తాను తోపు అని ప్రూవ్ చేసుకన్నాడు. అతడు తాజాగా పట్టిన ఓ క్యాచ్​కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అండర్సన్ బౌలింగ్​లోనే కాదు.. ఫీల్డింగ్​లోనూ తాను తోపు అని ప్రూవ్ చేసుకన్నాడు. అతడు తాజాగా పట్టిన ఓ క్యాచ్​కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Feb 26, 2024 | 12:26 PMUpdated Feb 26, 2024 | 12:26 PM
అండర్సన్ క్యాచ్​కు ఫిదా అవ్వాల్సిందే! 41 ఏళ్ల వయసులోనూ పక్షిలా ఎగురుతూ..

జేమ్స్ అండర్సన్.. ప్రపంచ క్రికెట్​లో అద్భుతమైన పేసర్​గా పేరు తెచ్చుకున్నాడు. బాల్​ను ఇరు వైపులా స్వింగ్ చేయడంలో ఎక్స్​పర్ట్ అయిన అండర్సన్ 698 వికెట్లతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో మూడో ప్లేస్​లో ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) తర్వాత స్థానంలో ఉన్న అండర్సన్.. మరికొన్నాళ్లు ఇలాగే ఆడితే అత్యధిక వికెట్ల వీరుడిగా నిలబడే ఛాన్స్ ఉంది. అయితే ఈ పేసర్ తోపు బౌలరే కాదు.. మంచి ఫీల్డర్ కూడా. అందుకు రాంచీ టెస్టులో పట్టిన ఓ క్యాచ్ ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. భారత రెండో ఇన్నింగ్స్​ సమయంలో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (37) ఇచ్చిన క్యాచ్​ను సూపర్బ్​గా డైవ్ చేసి అందుకున్నాడు అండర్సన్.

ప్రస్తుతం అండర్సన్ వయసు 41 ఏళ్లు. కానీ అతడు మాత్రం కుర్రాడిలా సూపర్బ్ ఎనర్జీతో కనిపిస్తున్నాడు. సుదీర్ఘ బౌలింగ్ స్పెల్స్ వేయడమే గాక ఫీల్డింగ్​లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా గ్రౌండ్ ఫీల్డింగ్​లో అతడు మంచి దిట్ట. బౌండరీ లైన్ దగ్గర బంతుల్ని కాచుకొని చాలా రన్స్ కాపాడుతుంటాడు. టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ దీన్ని రిపీట్ చేశాడు. రోహిత్-జైస్వాల్ జోడీ కొట్టిన పలు బంతులు బౌండరీ లైన్ దాటకుండా ఆపాడు అండర్సన్. ఈ క్రమంలో నాలుగో రోజు ఉదయం 18వ ఓవర్​లో జైస్వాల్ కొట్టిన బాల్​ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. జో రూట్ బౌలింగ్​లో ఆఫ్ సైడ్ జైస్వాల్ భారీ షాట్​కు ప్రయత్నించగా.. బంతి గాల్లోకి లేచింది. వేగంగా దూసుకొస్తున్న బంతి దగ్గరకు సమీపించిన అండర్సన్.. పరిగెడుతూ ఒకేసారి పక్షిలా గాల్లోకి ఎగిరాడు. గ్రౌండ్​కు చేరువవుతున్న బాల్​ను ముందు వైపు డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు.

క్యాచ్ చూసి బ్యాటర్ జైస్వాల్​తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా షాకయ్యారు. అప్పటిదాకా వికెట్లు పడక, రన్స్ కూడా భారీగా లీక్ అవుతుండటంతో ఇంగ్లీష్ టీమ్ నిరాశగా కనిపించింది. కానీ అండర్సన్ సూపర్బ్ క్యాచ్​తో ఒక్కసారిగా ఆ జట్టులో ఆశలు మొలకెత్తాయి. వికెట్లు తీస్తాం, మ్యాచ్​ను గెలుస్తామనే నమ్మకం చిగురించింది. ఆ తర్వాత తక్కువ టైమ్​లోనే మరో 2 వికెట్లు తీసి మ్యాచ్​లోకి వచ్చింది ఇంగ్లండ్.

ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 118. రోహిత్ సేన విజయానికి ఇంకా 74 పరుగులు కావాలి. శుబ్​మన్ గిల్ (18 నాటౌట్​)తో పాటు రవీంద్ర జడేజా (3 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ మ్యాచ్​ను ఫినిష్ చేయాలని టీమిండియా కోరుకుంటోంది. పిచ్ కఠినంగా మారుతుండటం, స్పిన్​తో పాటు బౌన్స్​కు అనుకూలిస్తుండటంతో గిల్, జడేజా ఎక్కువ సేపు ఆడితే భారత్​కు టెన్షన్ తగ్గుతుంది. కొత్త బ్యాటర్లు వచ్చి క్రీజులో నిలబడటం అంత ఈజీ కాదు. మరి.. అండర్సన్ క్యాచ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: సెల్యూట్ కొట్టి మరీ సెలబ్రేషన్! జురెల్ అలా ఎందుకు చేశాడంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి