iDreamPost

IND vs ENG: టీమిండియాలో దక్కని చోటు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పుజారా!

  • Published Feb 14, 2024 | 12:45 PMUpdated Feb 14, 2024 | 12:45 PM

నయా వాల్ ఛటేశ్వర్ పుజారాకు మరోమారు మొండిచెయ్యి ఎదురైంది. రంజీల్లో దుమ్మురేపుతున్న ఈ సీనియర్ బ్యాటర్​ను సెలక్టర్లు కరుణించలేదు. ఇంగ్లండ్​తో సిరీస్​లోని మిగిలిన 3 టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు.

నయా వాల్ ఛటేశ్వర్ పుజారాకు మరోమారు మొండిచెయ్యి ఎదురైంది. రంజీల్లో దుమ్మురేపుతున్న ఈ సీనియర్ బ్యాటర్​ను సెలక్టర్లు కరుణించలేదు. ఇంగ్లండ్​తో సిరీస్​లోని మిగిలిన 3 టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు.

  • Published Feb 14, 2024 | 12:45 PMUpdated Feb 14, 2024 | 12:45 PM
IND vs ENG: టీమిండియాలో దక్కని చోటు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పుజారా!

రాజ్​కోట్​ ఆతిథ్యం ఇస్తున్న మూడో టెస్టుకు భారత జట్టు రెడీ అవుతోంది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో నెగ్గడంతో ఫుల్ జోష్​లో ఉంది రోహిత్ సేన. మొదటి మ్యాచులో ఓడినా ఇంగ్లండ్​ బజ్​బాల్​ను దీటుగా ఎదుర్కొని రెండో మ్యాచ్​లో గెలవడంతో సంతోషంలో ఉంది. 1-1తో సమంగా ఉన్న సిరీస్​లో ఆధిక్యం సాధించాలని భావిస్తోంది. రాజ్​కోట్​ టెస్టులో ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేయాలని అనుకుంటోంది. అందుకోసం జట్టు కూర్పులోనూ అనూహ్య మార్పులు చేస్తోంది. డొమెస్టిక్ క్రికెట్​లో పరుగుల వరద పారిస్తున్న ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, దేవ్​దత్ పడిక్కల్ లాంటి యంగ్​స్టర్స్​ను రంగంలోకి దించాలని టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే రెండు టెస్టుల్లోనూ ఒకరిద్దరు తప్ప బ్యాటింగ్ యూనిట్ మొత్తం దారుణంగా ఫెయిలవడంతో సీనియర్ ఛటేశ్వర్ పుజారాను తీసుకొస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ సెలక్టర్లు అతడికి మళ్లీ మొండిచెయ్యి చూపారు. దీనిపై తాజాగా పుజారా రియాక్ట్ అయ్యాడు.

రంజీ ట్రోఫీ-2024 సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నా పుజారాను సెలక్టర్లు కరుణించలేదు. నయా వాల్​కు బదులు పలువురు యంగ్​స్టర్స్​ను టీమ్​లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పుజారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత్​కు ఆడే అవకాశం ఎప్పుడు వచ్చినా తాను రెడీగా ఉంటానన్నాడు. అదే ప్యాషన్​తో, గర్వంతో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని.. అందులో ఎలాంటి మార్పూ ఉండబోదన్నాడు. అది ఎప్పటికీ మారబోదని చెప్పాడు పుజారా. రంజీ ట్రోఫీలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సౌరాష్ట్ర జట్టు విజయవకాశాల మీదా అతడు స్పందించాడు. మణిపూర్​తో జరిగే నెక్స్ట్ మ్యాచ్​లో నెగ్గితే రంజీ ట్రోఫీ నాకౌట్స్​కు తాము చేరుకునే ఛాన్స్ ఉందన్నాడు పుజారా. జట్టు గెలుపు కోసం చివరి వరకు పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

‘ఒక క్రికెటర్​కు ఎప్పుడూ కొత్త సవాళ్లు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే నిరంతరం మన గేమ్​ను మెరుగుపర్చుకుంటూ ఉండాలి. గత ఏడాదిన్నర కాలంగా నేను స్వీప్ షాట్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నా. అలాగే రివర్స్ స్పీప్, లాఫ్టెడ్ షాట్స్​ మీదా ఫోకస్ పెట్టా. కఠిన పిచ్​ల మీద పరుగులు రానప్పుడు ఇలాంటి షాట్స్ పనికొస్తాయి. 100 టెస్టులు ఆడామా, 10 వేల పరుగులు చేశామా అనేది ముఖ్యం కాదు. ప్రతి మ్యాచ్​ను ఫ్రెష్​గా చూడాలి. ఎంత ఎక్స్​పీరియెన్స్ ఉన్నా బ్యాటర్ ఔట్ అవ్వక తప్పదు. అందుకే రివర్స్ స్వీప్ లాంటి అన్​ఆర్థడాక్స్ షాట్స్ నేర్చుకోవడం అవసరం. అందుకే వాటిని సాధన చేస్తున్నా. ఈ ఏడాది రంజీ సీజన్​లో డిఫికల్ట్ పిచ్​లపై ఆడినప్పుడు ఈ షాట్స్ ద్వారా పరుగులు రాబట్టా. ఇక, భారత జట్టుకు ఆడే ఛాన్స్ ఎప్పుడు వచ్చినా నేను రెడీ. దేశానికి ప్రాతినిధ్యం వహించడంలో ఉండే గర్వం, ఇష్టం, ప్రేమలో ఎలాంటి మార్పూ ఉండదు’ అని పుజారా చెప్పుకొచ్చాడు. మరి.. భారత జట్టులో చోటు దక్కకపోవడంపై పుజారా చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: సొంత జట్టు పరువు తీసిన కన్నడ డైరెక్టర్.. RCBకి అంత సీన్ లేదంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి