iDreamPost

ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్​కు గుడ్​న్యూస్.. అదే జరిగితే భారత్​కు కష్టమే!

  • Published Feb 20, 2024 | 3:00 PMUpdated Feb 20, 2024 | 3:00 PM

టీమిండియా చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లండ్ బాధలో ఉంది. ఈ నిరాశలో నుంచి బయటపడి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది స్టోక్స్ సేన.

టీమిండియా చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లండ్ బాధలో ఉంది. ఈ నిరాశలో నుంచి బయటపడి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది స్టోక్స్ సేన.

  • Published Feb 20, 2024 | 3:00 PMUpdated Feb 20, 2024 | 3:00 PM
ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్​కు గుడ్​న్యూస్.. అదే జరిగితే భారత్​కు కష్టమే!

వరుస గెలుపులు, ఫుల్ డామినేషన్, ఎక్కడకు వెళ్లినా స్వాగతం పలికే విజయాలు.. ఇదీ కొన్నాళ్ల కింద వరకు ఇంగ్లండ్ టీమ్​ సిచ్యువేషన్. ఆ జట్టు ప్రయోగిస్తున్న బజ్​బాల్​ వలలో పడి మహా మహా జట్లే అతలాకుతలం అయ్యాయి. ఓటమో, గెలుపో ఏదో ఒకటి తేలిపోవాల్సిందే అన్నట్లు స్టోక్స్ సేన ఆడుతూ ప్రత్యర్థులను వణికించింది. కానీ పది రోజుల్లో అంతా మారిపోయింది. భారత్ చేతిలో వరుసగా రెండు ఘోర ఓటములు ఎదురవడంతో ఇంగ్లీష్ టీమ్​కు ఏదీ పాలుపోవడం లేదు. రాజ్​కోట్ మ్యాచ్​లో ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో చిత్తవడాన్ని ఇంగ్లండ్ ప్లేయర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో ఆ టీమ్​కు ఓ గుడ్ న్యూస్. ఒకవేళ ఇది గానీ వర్కౌట్ అయిందా పర్యాటక జట్టును ఆపడం టీమిండియాకు కష్టమే. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రాజ్​కోట్ టెస్టులో భారత జట్టు దెబ్బకు గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. అయితే ఓటమి బాధలో ఉన్న ఆ టీమ్​కు, ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్. వెన్ను నొప్పి కారణంగా దాదాపుగా ఏడాది కాలం నుంచి బౌలింగ్​కు దూరంగా ఉంటున్న ఇంగ్లీష్ జట్టు సారథి బెన్ స్టోక్స్ తిరిగి బంతిని పట్టుకున్నాడని తెలుస్తోంది. నెట్స్​లో ఇంగ్లండ్ కెప్టెన్ జోరుగా బౌలింగ్​ ప్రాక్టీస్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. రాంచీ ఆతిథ్యం ఇస్తున్న నాలుగో టెస్టులో అతడు బౌలింగ్​కు దిగడం ఖాయమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. వీటికి తాజాగా స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. మూడో టెస్టు తర్వాత ఓ స్పోర్ట్స్ వెబ్​సైట్​కు ఇంటర్వ్యూ ఇచ్చాడు స్టోక్స్. ఈ సందర్భంగా మీరు బౌలింగ్ చేసేందుకు రెడీగా ఉన్నారా? అని అతడికి ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. తాను కచ్చితంగా బౌలింగ్ చేస్తానని చెప్పలేనని స్టోక్స్ చెప్పాడు.

‘కచ్చితంగా బౌలింగ్ చేస్తానని చెప్పలేను. అలాగని చేయననీ అనలేను. నేను బౌలింగ్ చేయాలా? వద్దా? అనే దాని గురించి మా మెడికట్ టీమ్​తో ఇంకా డిస్కస్ చేస్తున్నా. కానీ ప్రాక్టీస్ సెషన్స్​లో మాత్రం నేను 100 పర్సెంట్ బౌలింగ్​ చేయగలుగుతున్నా. ఆ టైమ్​లో నాకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. త్వరలో తిరిగి బౌలింగ్ మొదలు పెట్టగలనని ఆశిస్తున్నా’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ కెప్టెన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. రాంచీ టెస్టులో స్టోక్స్ బౌలింగ్ చేయడం పక్కా అని అంటున్నారు. ప్రమాదం ముంచుకొస్తోందని.. అతడు బౌలింగ్​కు దిగితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎలా మేనేజ్ చేస్తాడోనని చెబుతున్నారు. అయితే టీమిండియా బ్యాటర్లు ప్రస్తుతం ఉన్న ఫామ్​కు ఇదేమంత డేంజర్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. జైస్వాల్, రోహిత్, సర్ఫరాజ్​, జడేజాలు స్టోక్స్​ బౌలింగ్​ను ఓ ఆటాడుకుంటారని అంటున్నారు. ఇక, టెస్టుల్లో స్టోక్స్ ఇప్పటిదాకా 197 వికెట్లు తీయడం గమనార్హం. మరి.. స్టోక్స్​ ప్రమాదాన్ని భారత్ ఈజీగా దాటుతుందని మీరు భావిస్తే కామెంట్‌ చేయండి.

ఇదీ చదవండి: హార్ధిక్‌ పాండ్యాకు షాక్‌..! రోహిత్‌ శర్మకు అండగా గంగూలీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి