iDreamPost

IND vs ENG: నాలుగో టెస్టుకు ముందు భారత్​కు గుడ్​న్యూస్.. జట్టులోకి మరో స్టార్!

  • Published Feb 19, 2024 | 1:19 PMUpdated Feb 19, 2024 | 1:19 PM

రాజ్​కోట్ టెస్టులో నెగ్గి ఫుల్ జోష్​లో ఉంది టీమిండియా. ఇదే ఊపులో రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్టులోనూ నెగ్గి సిరీస్​ను పట్టేయాలని చూస్తోంది.

రాజ్​కోట్ టెస్టులో నెగ్గి ఫుల్ జోష్​లో ఉంది టీమిండియా. ఇదే ఊపులో రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్టులోనూ నెగ్గి సిరీస్​ను పట్టేయాలని చూస్తోంది.

  • Published Feb 19, 2024 | 1:19 PMUpdated Feb 19, 2024 | 1:19 PM
IND vs ENG: నాలుగో టెస్టుకు ముందు భారత్​కు గుడ్​న్యూస్.. జట్టులోకి మరో స్టార్!

టీమిండియా ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉంది. ఇంగ్లండ్​తో సిరీస్ స్టార్ట్ అవడానికి ముందు కాస్త ఒత్తిడిలో కనిపించింది మన టీమ్. బజ్​బాల్​ క్రికెట్ అంటూ భయపెడుతున్న ఇంగ్లీష్ టీమ్​ను ఎలా ఎదుర్కొంటుందోననే ఆందోళన ఉండేది. ఉప్పల్ టెస్టులో ఓటమితో రోహిత్ సేన మీద మరింత ప్రెజర్ పెరిగింది. అయితే వైజాగ్ ఆతిథ్యం ఇచ్చిన రెండో టెస్టు నుంచి అంతా మారిపోయింది. బజ్​బాల్​ను అర్థం చేసుకొని దానికి కౌంటర్ ఇవ్వడం ఎలాగో గ్రహించిన భారత క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి సిరీస్​లో 2-1తో టీమ్​ను లీడ్​లోకి తీసుకెళ్లారు. రాజ్​కోట్​ మ్యాచ్​లోనైతే ఇంగ్లండ్​ను ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో చిత్తు చేశారు. ఇదే ఊపులో నాలుగో టెస్టులోనూ నెగ్గి సిరీస్​ను పట్టేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలో రోహిత్ సేనకు ఒక గుడ్ న్యూస్. జట్టులోకి మరో స్టార్ ప్లేయర్ రానున్నాడు.

రాంచీ ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగో టెస్టుకు ముందు భారత్​కు శుభవార్త. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్​లో జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది. గాయం కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన ఈ స్టైలిష్ బ్యాట్స్​మన్ రాజ్​కోట్ టెస్టులో ఆడటం ఖాయంగా కనిపించింది. కానీ గాయం పూర్తిగా మానకపోవడంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉండిపోయాడు. అయితే అతడు ఇప్పుడు పూర్తి ఫిట్​నెస్​తో ఉన్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. నాలుగో టెస్టులో రాహుల్ బరిలోకి దిగడం పక్కా అని సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హింట్ ఇచ్చాడు. అతడు కోలుకున్నాడని చెప్పాడు. అయితే రాంచీ టెస్టులో ఆడతాడా? లేదా? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ క్రికెట్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం రాహుల్​ బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడట.

ఒకవేళ రాహుల్ మ్యాచ్​ ఫిట్​నెస్ సాధిస్తే అతడ్ని నేరుగా టీమ్​లోకి తీసుకోవడం ఖాయం. అప్పుడు కేఎల్ ప్లేస్​లో టీమ్​లోకి వచ్చిన యంగ్​ బ్యాటర్ రజత్ పాటిదార్ బెంచ్​కే పరిమితం అవుతాడు. గత రెండు టెస్టుల్లోనూ ఛాన్స్ వచ్చినా దాన్ని రజత్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. చెప్పుకోదగ్గ నాక్ ఆడలేదు. కాబట్టి రజత్​ను తప్పించి రాహుల్​కు రెడ్ కార్పెట్ పరచడం ఖాయమని సమాచారం. నాలుగో టెస్టులో ఆడే భారత జట్టులో మరో మార్పు జరగడం కూడా పక్కా అని తెలుస్తోంది. వర్క్ లోడ్ కారణంగా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారట. అతడి స్థానంలో యంగ్ పేసర్ ఆకాశ్ దీప్​ను టీమ్​లోకి తీసుకునే ఛాన్స్ ఉందని వినికిడి. అయితే అటు రాహుల్ రాకపై గానీ ఇటు బుమ్రా రెస్ట్ గురించి గానీ బీసీసీఐ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ రాహుల్ టీమ్​లోకి వస్తే మాత్రం ఇంగ్లండ్​ను పోయించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఆ టీమ్​కు ఇక దబిడిదిబిడేనని చెబుతున్నారు. మరి.. రాహుల్​ రాక కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Yashasvi Jaiswal: జైస్వాల్‌ జీవితంలో ఈ వ్యక్తి దేవుడు! కుర్రాడి తలరాతనే మార్చేశాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి