iDreamPost

Mohammed Siraj: బజ్​బాల్​ స్ట్రాటజీపై సిరాజ్ షాకింగ్ రియాక్షన్.. అసలేం అనుకుంటున్నారు!

  • Published Jan 24, 2024 | 2:01 PMUpdated Jan 24, 2024 | 5:55 PM

టీమిండియాపై బజ్​బాల్ స్ట్రాటజీని ప్రయోగిస్తామంటూ ఇంగ్లండ్ బెదిరిస్తోంది. అయితే దీనికి భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.

టీమిండియాపై బజ్​బాల్ స్ట్రాటజీని ప్రయోగిస్తామంటూ ఇంగ్లండ్ బెదిరిస్తోంది. అయితే దీనికి భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.

  • Published Jan 24, 2024 | 2:01 PMUpdated Jan 24, 2024 | 5:55 PM
Mohammed Siraj: బజ్​బాల్​ స్ట్రాటజీపై సిరాజ్ షాకింగ్ రియాక్షన్.. అసలేం అనుకుంటున్నారు!

భారత్-ఇంగ్లండ్ సిరీస్​ క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకుంటోంది. టెస్ట్ ఫార్మాట్​లోని టాప్ టీమ్స్ మధ్య జరుగుతున్న ఈ సమరానికి చాలా స్పెషాలిటీ ఉంది. భారత్​ను తమ సొంతగడ్డ మీద ఓడించడం మామూలు విషయం కాదు. గతంలో ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చిన తోపు జట్లు అన్నీ టీమిండియా స్పిన్ ఆయుధాన్ని తట్టుకోలేక తోకముడుచుకొని వెళ్లిపోయాయి. అలాంటి భారత్​పై బజ్​బాల్​ స్ట్రాటజీని అమలు చేసి విజయం సాధిస్తామంటోంది ఇంగ్లండ్. ధనాధన్ ఇన్నింగ్స్​లు, వికెట్లు టార్గెట్ చేసుకొని బౌలింగ్ చేస్తూ మ్యాచ్​ను త్వరగా ముగించేందుకు ప్లాన్ చేస్తోంది. కానీ స్పిన్ ట్రాక్స్ మీద పటిష్టమైన భారత జట్టుపై ఇది వర్కౌట్ అవడం కష్టమే. కానీ బజ్​బాల్​తోనే భారత్​ను పడగొడతామంటూ ఇంగ్లీష్ క్రికెటర్లు ప్రగల్భాలకు పోతున్నారు. దీనిపై స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ రియాక్ట్ అయ్యాడు. ఆ జట్టుకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.

అసలు ఇంగ్లండ్ తమ గురించి ఏమనుకుంటోందని సిరాజ్ అన్నాడు. బజ్​బాల్​ లేదు.. గిజ్​బాల్​ లేదు తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్​ను ఒక్క రోజులోనే ముగిస్తామని హెచ్చరించాడు. ‘ఒకవేళ ఇంగ్లండ్​ బజ్​బాల్​ స్ట్రాటజీతో ఆడితే మ్యాచ్ ఒక్క రోజులోనే ముగుస్తుంది. ఒకటి లేదా రెండ్రోజుల్లోనే ఇంగ్లీష్ టీమ్​ను చిత్తుగా ఓడిస్తాం. భారత్​లో బజ్​బాల్ పనిచేయదు. ఇక్కడ బాల్ ఒక్కోసారి గింగిరాలు తిరుగుతుంది. మరికొన్ని సార్లు బాల్ స్ట్రయిట్​గా వస్తుంది. కాబట్టి బజ్​బాల్​ ఫార్ములా ఇక్కడ వర్కవుట్ కాదు. అయినా సరే బజ్​బాల్​నే ప్రయోగిస్తామంటే ఆ ఛాలెంజ్​కు మేం రెడీ. అది మాకు మంచే చేస్తుంది. మ్యాచ్ త్వరగా ముగుస్తుంది’ అని సిరాజ్ స్పష్టం చేశాడు. ఈ సిరీస్ ప్రిపరేషన్స్ మీదా స్టార్ పేసర్ రియాక్ట్ అయ్యాడు. తాను బాగా సన్నద్ధం అయ్యానని.. కొత్త బంతితో బౌలింగ్ చేసేందుకు రెడీగా ఉన్నానని సిరాజ్ తెలిపాడు. న్యూ బాల్​తో బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదన్నాడు.

siraj shocking comments on england team

‘నేను కొత్త బంతితో బౌలింగ్ చేస్తా. కాబట్టి నా లైన్ అండ్ లెంగ్త్ ఒకేలా ఉంటుంది. ఫార్మాట్ ఏదైనా సరే నేను పెద్దగా మార్పులు చేయను. రెడ్ బాల్, వైట్ బాల్​ దేంట్లోనైనా కేవలం స్వల్ప మార్పులతో ఆడేందుకు సిద్ధమవుతా. అయితే టెస్ట్ క్రికెట్​లో వికెట్​కు 5 నుంచి 6 మీటర్ల బౌలింగ్​లో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యాట్స్​మెన్​ క్రీజుకు ముందు బంతులు విసిరితేనే వికెట్లు పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బాల్ స్వింగ్ అవ్వకపోతే అప్పుడు లెంగ్త్​ను అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే బాల్​ను కన్​సిస్టెంట్​గా ఒకే స్పాట్​లో విసిరేందుకు ప్రయత్నిస్తుంటా. కొత్త బాల్ అయినా పాత బాల్ అయినా నా ప్రయత్నం లెంగ్త్​, స్పాట్​ను పట్టుకోవడం మీదే ఉంటుంది. ఆ కన్​సిస్టెన్సీనే నా సక్సెస్​కు కారణం’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. బజ్​బాల్​కు కౌంటర్​గా సిరాజ్ కామెంట్స్ చేయడం, మ్యాచ్​ను ఒక్కరోజులోనే ముగిస్తామని చెప్పడంతో ఈ సిరీస్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి.. ఒక్కరోజులోనే మ్యాచ్​ను ముగిస్తామంటూ ఇంగ్లండ్​కు సిరాజ్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి