iDreamPost

IND vs ENG: ఉప్పల్​లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్.. ఫ్రీ టికెట్లు పొందేందుకు మరో ఛాన్స్!

  • Published Jan 21, 2024 | 12:24 AMUpdated Jan 21, 2024 | 12:24 AM

భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్టుల సిరీస్​లోని తొలి మ్యాచ్​కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్​కు సంబంధించిన ఫ్రీ టికెట్లు పొందేందుకు వారికి మరో ఛాన్స్.

భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్టుల సిరీస్​లోని తొలి మ్యాచ్​కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్​కు సంబంధించిన ఫ్రీ టికెట్లు పొందేందుకు వారికి మరో ఛాన్స్.

  • Published Jan 21, 2024 | 12:24 AMUpdated Jan 21, 2024 | 12:24 AM
IND vs ENG: ఉప్పల్​లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్.. ఫ్రీ టికెట్లు పొందేందుకు మరో ఛాన్స్!

వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా మరో ఆసక్తికర సిరీస్​లో ఆడేందుకు సన్నద్ధమవుతోంది. అయితే ఈసారి ఫార్మాట్ మారింది. ఇంగ్లండ్ టీమ్​తో 5 టెస్టుల్లో తలపడనుంది భారత్. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్​లో ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ర్యాంకింగ్స్​లో ఫస్ట్ ప్లేస్​కు చేరుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ సిరీస్​లోని తొలి మ్యాచ్​కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీన మొదటి టెస్ట్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు త్వరలో హైదరాబాద్​కు చేరుకోనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్​కు సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్​సీఏ). ఈ క్రమంలో టికెట్ల విషయంలో బంపరాఫర్ ప్రకటించిన హెచ్​సీఏ దాన్ని పొడిగించింది.

ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్​కు విద్యార్థులకు ఫ్రీ టికెట్లు ఇవ్వనున్నట్లు హెచ్​సీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై హెచ్​సీఏ ప్రెసిడెంట్ జగన్​ మోహన్ రావు స్పందించారు. ఈసారి 25 వేల మంది స్కూల్ స్టూడెంట్స్​కు ఉచితంగా మ్యాచ్ టికెట్లు అందించనున్నట్లు జగన్​ మోహన్​ రావు తెలిపారు. రోజుకు 5 వేల మంది చొప్పున విద్యార్థులను మ్యాచ్ చూసేందుకు అనుమతిస్తామని చెప్పారు. టికెట్ల కోసం ఈ నెల 18 వరకు 400 నుంచి 500 స్కూల్స్ దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు. టికెట్ల దరఖాస్తు కోసం రేపు సాయంత్రం వరకు అవకాశం ఇచ్చామని వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు ఈ ఛాన్స్​ను సద్వినియోగం చేసుకోవాలని జగన్​ మోహన్ రావు కోరారు. ఫ్రీ టికెట్లు పొందే అవకాశాన్ని సర్కారు స్కూళ్లు మిస్ అవ్వొద్దని తెలిపారు.

ఇక, తొలి టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్​లో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం కూడా జరగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యానువల్ అవార్డ్స్ ఫంక్షన్​ను భాగ్యనగరంలోనే నిర్వహించనుంది. తొలి టెస్ట్​కు ముందే ఈ ప్రోగ్రామ్ జరగనుంది. జనవరి 23న జరగనున్న ఈ కార్యక్రమంలో టీమిండియాతో పాటు ఇంగ్లండ్ జట్టు క్రికెటర్లు కూడా పాల్గొననున్నారు. కరోనా తర్వాత బీసీసీఐ యానువల్ ఫంక్షన్ నిర్వహించనుండటం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం. దీంతో ఈసారి ఎవరెవరు పురస్కారాలు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఇంగ్లండ్​తో జరిగే తొలి రెండు టెస్టులకు భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ మహ్మద్ షమి ఈ రెండు మ్యాచులకు దూరమయ్యాడు. మిగిలిన మూడు టెస్టుల్లో అతడు ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ ఇంజ్యురీ నుంచి అతడు ఇంకా కోలుకోలేదని.. ఇంగ్లీష్ టీమ్​తో సిరీస్ మొత్తానికి అతడు దూరమవుతాడని వినికిడి. మరి.. భారత్-ఇంగ్లండ్ సిరీస్ కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి