iDreamPost

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌! ముగ్గురు భారత ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం?

  • Author pasha Published - 12:52 PM, Thu - 23 November 23

ఆస్ట్రేలియాతో భారత్ ఆడనున్న మూడు టీ20ల సిరీస్​లో ముగ్గురు ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. అసలు ఎవరా ప్లేయర్లు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాతో భారత్ ఆడనున్న మూడు టీ20ల సిరీస్​లో ముగ్గురు ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. అసలు ఎవరా ప్లేయర్లు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author pasha Published - 12:52 PM, Thu - 23 November 23
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌! ముగ్గురు భారత ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే ఇండియన్‌ క్రికెట్‌ కోలుకుంటుంది. ఆటగాళ్లతో పాటు, క్రికెట్‌ అభిమానులు ఆ పీడకలను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కోసం సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. వన్డే వరల్డ్‌ కప్‌ ఆడిన జట్టుకు పూర్తిగా రెస్ట్‌ ఇస్తూ.. పూర్తిగా యువ క్రికెటర్లుతో కూడా జట్టును ఎంపిక చేశారు. వరల్డ్‌ కప్‌ ఆడిన.. సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కడే టీ20 సిరీస్‌ కూడా ఆడనున్నాడు. అతనే కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. అలాగే చివరి రెండు టీ20లకు శ్రేయస్‌ అయ్యర్‌ను సైతం సెలెక్టర్లు ఎంపిక చేశారు. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌ కాగా, తొలి మూడు మ్యాచ్‌లకు రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్‌ అయ్యర్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. జట్టులో ఓ ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కలేదని క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ ముగ్గురు ఎవరంటే.. యుజ్వేంద్ర చాహల్‌, సంజు శాంసన్‌, రియాన్‌ పరాగ్‌. వీరి ముగ్గురిని కూడా సెలెక్టర్లు ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేయలేదు. చాహల్‌, శాంసన్‌లను వన్డే వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేయకపోతేనే చాలా మంది క్రికెట్‌ అభిమానులు బీసీసీఐని తిట్టిపోశారు. ఇప్పుడు టీ20 సిరీస్‌ కూడా వాళ్లను ఎంపిక చేయకపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న చాహల్‌ను ఎలా పక్కనపెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. చాహల్‌ ఇప్పటి వరకు 80 టీ20లు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 35 స్థానంలో ఉన్నాడు.

ఇక టాలెంట్‌కు ఏ మాత్రం కొదవలేని యువ క్రికెటర్‌ ఎవరంటే సంజు శాంసన్‌ అనే చెప్పాలి. కానీ, అదే స్థాయిలో దరిద్రం కూడా అతనికే ఉంది. టీ20లోకి అప్పుడెప్పుడో 2015లోనే ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటి వరకు జట్టులో నిలదొక్కుకోలేకపోయాడు శాంసన్‌. అడపా దడపా అవకాశాలు వస్తున్నా.. అప్‌ అండ్‌ డౌన్‌గా అతని బ్యాటింగ్‌ సాగింది. పైగా జట్టులో వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ ప్లేస్‌కు గట్టి పోటీ ఉండటం కూడా శాంసన్‌కు ఛాన్స్‌లు రాకుండా చేస్తోంది. ఇక మరో యంగ్‌ ప్లేయర్‌.. రియాన్‌ పరాగ్‌. దేశవాళి క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నా.. పరాగ్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో పరాగ్‌ ఆల్‌రౌండర్‌ మంచి ప్రదర్శన కనబర్చాడు. 10 మ్యాచ్‌ల్లో 7 హాఫ్‌ సెంచరీలతో 510 పరుగులు చేసి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పరాగ్‌కు చోటు దక్కుతుందని అంతా భావించినా.. సెలెక్టర్లు అతనికి షాకిచ్చారు. మరి ఈ ముగ్గురు క్రికెటర్లకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకుండా సెలెక్టర్లు అన్యాయం చేశారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీ20 క్రికెట్​కు రోహిత్ దూరం.. ఇక టీమ్ ఫ్యూచర్ అతడి చేతుల్లోనే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి