iDreamPost

Rohit Sharma: నీళ్లు తాగినంత సులువుగా సిక్సులు బాదుతున్న రోహిత్! అతడికే ఎలా సాధ్యం?

  • Published Jan 18, 2024 | 9:48 AMUpdated Jan 18, 2024 | 2:31 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ మరోమారు గర్జించింది. భారీ సిక్సులతో ఆఫ్ఘానిస్థాన్​పై పిడుగులా విరుచుకుపడ్డాడు హిట్​మ్యాన్. నీళ్లు తాగినంత సులువుగా సిక్సర్లు బాదాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ మరోమారు గర్జించింది. భారీ సిక్సులతో ఆఫ్ఘానిస్థాన్​పై పిడుగులా విరుచుకుపడ్డాడు హిట్​మ్యాన్. నీళ్లు తాగినంత సులువుగా సిక్సర్లు బాదాడు.

  • Published Jan 18, 2024 | 9:48 AMUpdated Jan 18, 2024 | 2:31 PM
Rohit Sharma: నీళ్లు తాగినంత సులువుగా సిక్సులు బాదుతున్న రోహిత్! అతడికే ఎలా సాధ్యం?

క్రికెట్​లో విధ్వంసక బ్యాటర్లు ఎంతో మంది ఉన్నారు. బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడే అటాకింగ్ బ్యాటర్లను చూస్తూనే ఉన్నాం. అయితే కంటిన్యూస్​గా భారీ షాట్లు బాదుతూ భారీ స్కోర్లు చేసే బ్యాటర్లు మాత్రం కొందరే ఉన్నారు. అలాంటి అరుదైన బ్యాట్స్​మెన్​లో ఒకడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు క్రీజులోకి అడుగుపెట్టాడా ఊచకోత స్టార్ట్ అయిపోతుంది. ఏ బౌలర్, ఏ పిచ్, ఏ ఫార్మాట్ అనేది చూడకుండా వచ్చిన బాల్​ను వచ్చినట్లు బౌండరీ లైన్ దాటించడమే హిట్​మ్యాన్​కు తెలుసు. ఆఫ్ఘానిస్థాన్​తో బుధవారం రాత్రి జరిగిన మూడో టీ20లో బ్యాట్​తో గర్జించాడు హిట్​మ్యాన్. 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో ఏకంగా 121 పరుగులు చేశాడు. సూపర్ ఓవర్​లోనూ భారీ సిక్సులతో విరుచుకుపడి టీమ్​ను గెలిపించాడు. అయితే రోహిత్ ఇంత ఈజీగా సిక్సులు కొట్టడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆఫ్ఘాన్​తో జరిగిన చివరి టీ20లో భారత ఇన్నింగ్స్ టైమ్​లో 8 భారీ సిక్సులు బాదాడు రోహిత్. అలాగే మొదటి సూపర్ ఓవర్​లో 2, రెండో సూపర్ ఓవర్​లో 1 సిక్స్ కొట్టాడు. సూపర్ ఓవర్​లో ప్రెజర్​ను తట్టుకోలేక యంగ్ బ్యాటర్స్​ యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ లాంటి వాళ్లు షాట్లు కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సిక్స్ సంగతి పక్కన పెడితే బౌండరీ కూడా బాదలేకపోయారు. కానీ రోహిత్ మాత్రం అలవోకగా సిక్సులు కొట్టాడు. దీంతో అసలు అంత ఈజీగా అతడు ఎలా బిగ్ సిక్సెస్ కొడుతున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. అయితే దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటనేది ఇటీవల ఓ సందర్భంలో హిట్​మ్యాన్ పంచుకున్నాడు. సిక్సులు కొట్టడం అంత ఈజీ కాదని.. దీనికి మూడ్నాలుగు విషయాలు పర్ఫెక్ట్​గా కలసిరావాలని తెలిపాడు. బాల్​ను సరిగ్గా మిడిల్ చేయాలని చెప్పాడు. సిక్సులు కొట్టడానికి భారీ శరీరం ఉండాల్సిన అవసరం లేదన్నాడు.

How come Rohit is the only one hitting sixes

‘సిక్సులు కొట్టేందుకు హ్యూజ్ బాడీ ఉండాల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా సిక్సులు కొట్టొచ్చు. అయితే పవర్ ఒక్కటే ఇక్కడ ముఖ్యం కాదు. పవర్​తో పాటు టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బాల్ సరిగ్గా బ్యాట్ మధ్యలో తగలాలి. బాల్ మిడిల్ అయిన సమయంలో బ్యాట్స్​మన్ తల సరైన పొజిషన్​లో ఉండాలి. ఇలా సిక్సులు కొట్టేందుకు చాలా విషయాలు కలసిరావాలి’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ సిక్సులు కొట్టడం వెనుక టైమింగ్, పవర్​తో పాటు మరో విషయం కూడా దాగి ఉంది. అతడి హ్యాండ్-ఐ (చేతులు-కళ్లు) కోఆర్డినేషన్ సూపర్బ్ అనే చెప్పాలి. బాల్​ను పర్ఫెక్ట్ టైమింగ్​తో కనెక్ట్ చేయడానికి హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అది బాగుండటంతో అలవోకగా సిక్సులు బాదుతున్నాడు హిట్​మ్యాన్. అదే టైమ్​లో ప్రత్యర్థి బౌలర్లు ఎవరనేది పట్టించుకోకపోవడం, ఎంత ప్రెజర్ ఉన్నా అపోజిషన్ టీమ్​ మీదకు నెడుతూ తన బ్యాటింగ్​ను ఆస్వాదించడం కూడా అతడి సీక్రెట్​ అని చెప్పాలి. మరి.. రోహిత్ సిక్సెస్ వెనుక ఇంకేమైనా సీక్రెట్ ఉందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IND vs AFG: ఆఫ్ఘాన్​తో చివరి టీ20.. భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి