iDreamPost

Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఇండియా రికార్డు.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • Author Soma Sekhar Published - 09:17 AM, Sat - 7 October 23
  • Author Soma Sekhar Published - 09:17 AM, Sat - 7 October 23
Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఇండియా రికార్డు.. చరిత్రలో ఇదే తొలిసారి!

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. దాదాపు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు టీమిండియా క్రీడాకారులు. దీంతో ఏషియన్ గేమ్స్ లో భారత్ పతకాల జోరు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మహిళల కబడ్డీలో భారత్ గోల్డ్ మెడల్ సాధించడంతో.. సరికొత్త రికార్డును సృష్టించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చైనీస్ తైపీ టీమ్ ను 26-25తో ఓడించింది భారత్. ఈ గోల్డ్ మెడల్ తో టీమిండియా ఖాతాలో 100 పతకాలు చేరాయి.

ఏషియన్ గేమ్స్ లో టీమిండియా క్రీడాకారులు దూసుకెళ్తున్నారు. తాజాగా జరిగిన మహిళల కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించింది భారత జట్టు. దీంతో ఆసియా క్రీడల్లో తొలిసారి 100 పతకాల మార్క్ ను అందుకుంది. శనివారం ఒక్కరోజే 3 గోల్డ్ మెడల్స్ ను భారత్ సాధించింది. ఆర్చరీలో రెండు గోల్డ్ మెడల్స్ రాగా.. కబడ్డీలో స్వర్ణంతో మెరిశారు మహిళలు. దీంతో ఆసియా క్రీడల గత చరిత్రను భారత్ తిరగరాసింది. 2002లో కేవలం 36 పతకాలు సాధించిన భారత్.. రానురాను తన పతకాల సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. గతేడాది ఆసియా క్రీడల్లో 70 పతకాలు సాధిస్తే.. తాజాగా జరుగుతున్న క్రీడల్లో ఇప్పటికే 100 పతకాలు సాధించి.. దుసుకెళ్తోంది. భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 25 స్వర్ణాలు, 35 సిల్వర్, 40 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మరి ఆసియా క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి