iDreamPost

సెహ్వాగ్‌, రోహిత్‌ రికార్డ్స్‌ను చెరిపేసిన జైస్వాల్‌! తొలి భారత క్రికెటర్‌గా..

Yashasvi Jaiswal: ఇండియా, ఇంగ్లాడ్ మధ్య రాజ్ కోట్ వేదికగా మూడో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో యువ క్రికెటర్ జైస్వాల్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు.

Yashasvi Jaiswal: ఇండియా, ఇంగ్లాడ్ మధ్య రాజ్ కోట్ వేదికగా మూడో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో యువ క్రికెటర్ జైస్వాల్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు.

సెహ్వాగ్‌, రోహిత్‌ రికార్డ్స్‌ను చెరిపేసిన జైస్వాల్‌! తొలి భారత క్రికెటర్‌గా..

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన ఇండియా.. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 557 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ను టీమిండియా బౌలర్లు 122 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో.. 434 పరుగుల భారీ తేడాతో ఇండియా ఈ మ్యాచ్‌ గెలిచి.. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వచ్చింది.  ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్‌.. మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్  రికార్డును బద్దలు కొట్టాడు జైస్వాల్‌. టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక  సిక్స్ లు కొట్టిన టీమిండియా క్రికెటర్ గా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 సిక్సులు బాదాడు ఈ యువ ఓపెనర్‌. అందులో 9 సిక్స్‌తో టీమిండియా తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌ చరిత్ర సృష్టించాడు. జైస్వాల్‌ కంటే ముందు టీమిండియా ఆటగాళ్లు.. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, మయాంక్‌ అగర్వాల్‌ 8 సిక్సులతో తొలి స్థానంలో ఉండేవారు. వారి రికార్డును జైస్వాల్‌ బ్రేక్‌ చేశాడు. వీరిద్దరి తర్వాత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌ 7 సిక్సులతో ఉన్నాడు.

అలాగే హర్బజన్ సింగ్, హర్ధిక్ పాండ్యా, రోహిత్ శర్మ సైతం ఒక ఇన్నింగ్స్‌లో 7  సిక్సులు బాది ఉన్నారు. ఈ రికార్డుతో పాటు మరో వరల్డ్‌ రికార్డును కూడా జైస్వాల్‌ సమం చేశాడు. టెస్ట్‌ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు అత్యధిక రికార్డు పాకిస్థాన్‌ దిగ్గజ మాజీ ఆల్‌రౌండర్‌ వసీం అక్రమ్‌ పేరిట ఉంది. అతను ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 సిక్సులు కొట్టాడు. ఆ రికార్డును తాజాగా జైస్వాల్‌ సమం చేశాడు.  1996లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో వసీం అక్రమ్ 12 సిక్సులు బాదాడు.  మరి.. ఒక్కే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు కొట్టి  రికార్డు క్రియేట్ చేసిన జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి