iDreamPost

IND vs SA: టీమిండియా మెరుపులు.. 55 పరుగులకే సఫారీలు ఆలౌట్!

టీమిండియా రెండో టెస్టులో విజృంభించడంతో సౌత్ ఆఫ్రికా జట్టు కుప్పకూలింది. 55 పరుగుల అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది.

టీమిండియా రెండో టెస్టులో విజృంభించడంతో సౌత్ ఆఫ్రికా జట్టు కుప్పకూలింది. 55 పరుగుల అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది.

IND vs SA: టీమిండియా మెరుపులు.. 55 పరుగులకే సఫారీలు ఆలౌట్!

న్యూల్యాండ్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో టీమిండియా రెండో టెస్టులో తలపడుతోంది. మొదటి టెస్టులో ఘోర పరాభవాన్ని భారత జట్టు మాత్రమే కాదు.. టీమిండియా అభిమానులు కూడా ఇంకా మర్చిపోలేదు. అందుకే రెండో టెస్టులో టీమిండియా విజృంభించి ప్రతీకారం తీర్చుకోవాలంటూ అందరూ కోరుకున్నారు. అయితే ఫ్యాన్స్ కోరుకున్న దానికంటే భారత జట్టు డబుల్, త్రిబుల్ ఇంపాక్ట్ చూపించింది. ప్రొటీస్ జట్టును కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఒక్క సౌత్ ఆఫ్రికా ఆటగాడు కూడా గట్టిగా క్రీజులో నిలబడి 30 బంతులు దాటి ఆడలేకపోయాడు. ముఖ్యంగా సిరాజ్ మెరుపులకు సఫారీ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇదీ అసలైన రివేంజ్ అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన టీమిండియా ఆ మ్యాచు తాలుకా ప్రతీకారాన్ని ఇప్పుడే తీర్చేసుకుంది. రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా జట్టుకు ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా టీమిండియా బౌలర్లు విజృభించారు. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ పదునైన డెలివిరీలతో బ్యాటర్లకు డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తొలి వికెట్ నుంచి ఆఖరి వికెట్ వరకు వచ్చిన దారినే పెవిలియన్ చేరుకున్నారు. టాపార్డర్ మాత్రమే కాదు.. మిడిలార్డర్ కూడా పేకమేడలా కూలిపోయింది. సిరాజ్ స్వింగ్ కు వికెట్ సమర్పించుకోవడం తప్పితే వారికి మరో అవకాశం లేకుండా పోయింది. సౌత్ ఆఫ్రికా జట్టు 5 పరుగుల వద్ద తొలి వికెట్ ని కోల్పోయింది. స్కోర్ బోర్డు తిరిగి 55 వద్దకు వచ్చే సరికి ఆలౌట్ అయ్యింది. ఈ స్థాయి ప్రదర్శనను ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సౌత్ ఆఫ్రికా జట్టు కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఇంత తక్కువ స్కోరుకే ఆలౌట్ అవుతామని అస్సలు ఊహించి ఉండరు.

మ్యాచ్ సమురీ చూస్తే.. ఒక్క బ్యాటర్ కూడా 20 పరుగుల స్కోరును చేరుకోలేకపోయారు. అలాగే కేవలం ఇద్దరు బ్యాటర్స్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. మార్కరమ్(2), ఎల్గర్(4), డే జోర్జీ(2), స్టబ్స్(3), బెడింగామ్(12), కైల్ వెరైన్(15), జాన్సన్(0), కేశవ్ మహరాజ్(3), రబాడా(5), బర్గర్(4), లుంగి ఎంగిడి(0) పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇంక టీమిండియా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా జట్టును గల్లీ క్రికెటర్స్ తరహాలో వాళ్లు ట్రీట్ చేసిన విధానం అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా సిరాజ్ వేసిన 9 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి.. 6 వికెట్లు పడగొట్టాడు. 9 ఓవర్లలో 3 మెయిడిన్లు కూడా ఉన్నాయి. మరోవైపు బుమ్రా, ముఖేష్ కుమార్ కూడా చలరేగారు. బుమ్రా 8 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్ కేవలం 2.2 ఓవర్లలోనే 2 వికెట్లు తీసుకున్నాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ముఖేష్ ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు. మరోవైపు ప్రసిద్ కృష్ణ 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. వికెట్ తీసుకోకపోయినా కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక ఓవర్ మెయిడిన్ కూడా చేశాడు. మరి.. రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా విజృంభించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి