iDreamPost

IND vs SA Test: రెండో టెస్ట్ లో సిరాజ్ నిప్పులు.. కుప్పకూలిన సౌతాఫ్రికా టాప్ ఆర్డర్!

సౌతాఫ్రికాతో జరుగుతున్న సెకండ్ టెస్టు మ్యాచ్ లో భారత్ అదరగొడుతోంది. మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో సఫారీల టాప్ ఆర్డర్ కుప్పకూలింది.

సౌతాఫ్రికాతో జరుగుతున్న సెకండ్ టెస్టు మ్యాచ్ లో భారత్ అదరగొడుతోంది. మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో సఫారీల టాప్ ఆర్డర్ కుప్పకూలింది.

IND vs SA Test: రెండో టెస్ట్ లో సిరాజ్ నిప్పులు.. కుప్పకూలిన సౌతాఫ్రికా టాప్ ఆర్డర్!

భారత్- సౌతాప్రికా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాభవం చవిచూసింది. కాగా రెండో టెస్ట్ లో టీమిండియా కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఫ్యాన్స్ కోరుకున్నారు. అభిమానుల కోరికకు ఏమాత్రం తీసిపోకుండా భారత్ ప్రదర్శన ఉండంటం అందరినీ ఆనందానికి గురిచేస్తోంది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియం వేదికగా సఫారీలపై భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రొటీస్ జట్టుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. సిరాజ్ విసిరే బంతిని డిఫెండ్ చేయడానికి కూడా సౌత్ ఆఫ్రికా టాపార్డర్ కంగారు పడింది.

రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా జట్టుకు టీమిండియా బౌలర్లు పట్ట పగలు చుక్కలు చూపిస్తున్నారు. ప్రొటీస్ జట్టు టాపార్డర్ మొత్తం పేకమేడలా కూలిపోయింది. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ ఉగ్రరూపం దాల్చాడు. టాపార్టర్ కు ఏమాత్రం ఆస్కారం లేకుండా పదునైన బంతులు విసురుతూ ముప్పతిప్పలు పెట్టాడు. వారికి కనీసం బంతిని డిఫెండ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సిరాజ్ చెలరేగడంతో సౌత్ ఆఫ్రికా జట్టు 10 ఓవర్లలోపే కేవలం 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టీమ్ స్కోర్ 5 పరుగుల వద్ద మార్కరమ్ సిరాజ్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో 3 పరుగులకే టీమ్ రెండో వికెట్ ని కోల్పోయింది. డీన్ ఎల్గర్ ని సిరాజ్ పక్కా ప్లాన్ తో అవుట్ చేశాడు. డాట్ బాల్స్ వేస్తూ అతనిపై ప్రెజర్ పెంచాడు. ఆ తర్వాత గుడ్ లైన్ అండ్ లెంగ్త్ బాల్ వేసి అతనిడి బౌల్డ్ చేశాడు. సిరాజ్ వ్యూహానికి ఎల్గర్ కూడా షాకయ్యాడు.

రెండు వికెట్ల తర్వాత బుమ్రా కూడా తన ఖాతా తెరిచాడు. ట్రిస్టన్ స్టబ్స్ ను క్యాచ్ అవుట్ గా వెనక్కి పంపాడు. మళ్లీ సిరాజ్ చెలరేగడంలో సౌత్ ఆఫ్రికా జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగుల వద్ద టోనీ డీ జోర్జీ క్యాచ్ అవుట్ గా పెలియన్ చేరాడు. కాస్త కుదుటు పడుతున్నారు. బ్యాటర్లు ఫామ్ లోకి వస్తున్నారు అనుకునే సమయంలో మళ్లీ సిరాజ్ తన మార్క్ బౌలింగ్ తో 34 పరుగుల వద్ద డేవిడ్ బెడింగామ్(12)ను అవుట్ చేశాడు. మొత్తానికి హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ విజృంభించడంతో ప్రొటీస్ జట్టు నిలదొక్కుకోవడానికి అల్లాడుతోంది. 16వ ఓవర్లో సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టి మొత్తం ఈ మ్యాచ్ లో 5 వికెట్ హాల్ సొంతం చేసుకున్నాడు. సిరాజ్ విజృంభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి