iDreamPost

MS Dhoni: కృతజ్ఞత చూపేందుకు కోట్లు వదులుకున్నాడు! ఇది సార్‌ ధోని అంటే: కోహ్లీ

  • Published Feb 14, 2024 | 4:10 PMUpdated Feb 14, 2024 | 8:19 PM

ఎంఎస్‌ ధోని.. క్రికెట్‌లో సూపర్‌ స్టార్‌. చాలా కంపెనీలకు అతనే బ్రాండ్‌ అంబాసిడర్‌. అలా బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసినందుకు కొన్ని కోట్లు తీసుకుంటూ ఉంటాడు. కానీ, కొన్ని కోట్లు వదులుకొని ఒక వ్యక్తికి కృతజ్ఞత చూపించాడని కోహ్లీ వెల్లడించాడు. ఆ విషయమేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

ఎంఎస్‌ ధోని.. క్రికెట్‌లో సూపర్‌ స్టార్‌. చాలా కంపెనీలకు అతనే బ్రాండ్‌ అంబాసిడర్‌. అలా బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసినందుకు కొన్ని కోట్లు తీసుకుంటూ ఉంటాడు. కానీ, కొన్ని కోట్లు వదులుకొని ఒక వ్యక్తికి కృతజ్ఞత చూపించాడని కోహ్లీ వెల్లడించాడు. ఆ విషయమేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

  • Published Feb 14, 2024 | 4:10 PMUpdated Feb 14, 2024 | 8:19 PM
MS Dhoni: కృతజ్ఞత చూపేందుకు కోట్లు వదులుకున్నాడు! ఇది సార్‌ ధోని అంటే: కోహ్లీ

టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పే సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల తన మిత్రుడి కోసం అతని షాప్‌ పేరు స్టిక్కర్‌తో ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్‌ చేసి.. దాంతో రాంచీలో ప్రైమ్‌ స్పోర్ట్స్‌ అనే షాపు పేరు ఫుల్‌ ఫేమస్‌ అయిపోయింది. ధోని కెరీర్‌ ఆరంభంలో అతని స్నేహితుడు పరమ్‌జిత్‌ సింగ్‌ ఎంతో సహాయం చేశాడు. అతనికి ప్రైమ్‌ స్పోర్ట్స్‌ అనే షాప్‌ ఉంది. ఆ షాప్‌ పేరుతో ఉన్న బ్యాట్‌ను తాజాగా ధోని ప్రాక్టీస్‌లో ఉపయోగించాడు. అది తెగ వైరల్‌ అయింది. ఫ్రెండ్‌ కోసం ధోని చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంది.

అయితే.. ధోని ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి ఒక పని చేసి తన గొప్పమనసు చాటుకున్నాడు. గతం మర్చిపోని వాడే గొప్పొడు అనే మాటను నిజం చేస్తూ.. 2019 వరల్డ్‌ కప్‌లో ధోని చేసిన ఒక పని గురించి ఇప్పుడు తెలిసింది. ఆ మెగా టోర్నీలో ధోని బీఏఎస్‌ అనే స్టిక్కర్‌తో ఉన్న బ్యాట్‌ను కొన్ని మ్యాచ్‌లకు వినియోగించిన విషయం తెలిసిందే. అప్పటికే ధోని ఇంటర్నేషన్‌ క్రికెట్‌లో సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ కావడంతో ఆ స్టిక్కర్‌ వాడినందుకు అతనికి కోట్లలలో డబ్బు అంది ఉండి అనుకోవచ్చు. కానీ, ధోని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ బ్యాట్‌తో ఆడాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా. అదే నిజం. ఈ విషయాన్ని స్వయంగా బీఏఎస్‌ యజమాని వెల్లడించారు.

బీఏఎస్‌ అంటే బీట్‌ ఆల్‌ స్పోర్ట్స్‌ అనే క్రికెట్‌ కిట్‌ తయారీ సంస్థ ఉంది. ఈ సంస్థకు యజమాని సోమి కోహ్లీ. ధోని కెరీర్‌ ఆరంభంలో అతనికి తొలి సారి వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కిట్‌ను ఉచితంగా అందించి.. ధోనిని ప్రొత్సహించారు బీఏఎస్‌ అధినేత. ఆ సాయాన్ని గుర్తుపెట్టుకున్న ధోని.. 2019లో దానికి కృతజ్ఞత చూపించాడు. టోర్నీ ఆరంభానికి ముందు.. తన బ్యాట్లపై మీ కంపెనీ స్టిక్కర్లు వేసి పంపాలని సోమి కోహ్లీకి ధోని కోరాడు. ఆ మాటతో షాకైన సోమి కోహ్లీ.. దాని కోసం ధోనికి కొంత డబ్బు ఆఫర్‌ చేశారు.

ఇతర కంపెనీ పేర్లతో ఉన్న బ్యాట్‌ను వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలో వాడితే.. ధోనికి కోట్లలో డబ్బు చెల్లిస్తారు. కానీ, తను నా కంపెనీ పేరు వాడుతా అంటున్నాడు. అందుకోసం నేను ఎంతో కొంత డబ్బు చెల్లిస్తానంటే.. అందుకు ధోని ఒప్పుకోలేదు. ఒక్క రుపాయి కూడా తీసుకోకుండా ధోని బీఏఎస్‌ సిక్కర్ ఉన్న బ్యాట్లతో ఆడాడు. ధోనికి నచ్చజెప్పమని అతని భార్య సాక్షితో పాటు ధోని తల్లిదండ్రులు, స్నేహితులకు కూడా చెప్పాను. వాళ్లంతా కలిసి చెప్పిన ధోని వినలేదు. అది ధోని గొప్పతనం అంటూ సోమి కోహ్లీ చెప్పుకొచ్చారు. మరి కెరీర్‌ ఆరంభంలో తనకు చేసిన సాయం మర్చిపోకుండా.. దానికి కృతజ్ఞతను ఈ విధంగా చూపిన ధోనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి