iDreamPost

ఇంగ్లాండ్ బాదుడుకో పేరుంది. బాజ్‌బాల్ హిట్టింగ్ అంటే ఏంటి?

ఇంగ్లాండ్ బాదుడుకో పేరుంది. బాజ్‌బాల్ హిట్టింగ్ అంటే ఏంటి?

ఇప్పుడు టీం అంటే ఎలాగ ఉండాలి? ప‌్ర‌త్య‌ర్ధి ఊహించ‌ని టార్గెట్లు పెట్టాలి, వాటిని సాధించాలి. మరి ఆట‌గాడు? ప‌్ర‌తి క్ష‌ణం ఎలా మెరుగుప‌డాలో తెలుసుకోవాలి. మ‌రి కోచ్ సంగ‌తి? ఒక ఆట‌గాడి స్కిల్ ను పెంచ‌డం, జ‌ట్టు విజ‌య‌లు సాధించేలా గైడ్ చేయ‌డం. ఇవ‌న్నీ 20 ఏళ్ల క్రితం నాటి మాట‌లు.

ఇప్పుడు మారాల్సింది ఆట‌కాదు, క‌ల్చ‌ర్ మారాలి. ఇది ఎలాంటి కల్చ‌ర్ అంటే ప్ర‌త్య‌ర్ధి గుక్క‌తిప్పుకోనివ్వ‌నంత వేగం. మ‌నతో త‌ల‌ప‌డాలంటేనే, ఎదుటి టీంలో వ‌ణుకు మొద‌లుకావాలి. స్టేడియంలో ఎంట‌ర్ కావ‌డానికి ముందుజ‌రిగే మాన‌సిక యుద్దంలో గెల‌వాలి.

ఇంత‌టి పోటీ కాలంలోనూ క్రికెట్ ను జంటిల్మెన్ క్రికెట్ వైపు తీసుకెళ్లిన‌వాళ్ల‌లో ముందుండే ఆట‌గాడు ఇప్ప‌టి కోచ్ మెక్‌కల్లమ్‌. ఐపీఎల్ తొలి మ్యాచ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఈనాటి ట్వింటీట్వింటీకి అదే పునాది. న్యూజిలాండ్ టీంను విన్నింగ్ టీంగా మార్చాడు. టెస్ట్ క్రికెట్ లో వోల్డ్ ఛాంపియ‌న్ కావ‌డానికి మెక్‌కల్లమ్‌ క‌ల్చ‌రే కార‌ణం.

ఆ త‌ర్వాత ఇంగ్లాండ్ కు వ‌చ్చాడు. క్రికెట్ మొత్తాన్ని మెకల్లమైజ్డ్ చేశాడు. అప్ప‌టికే వ‌న్డేలో ఇంగ్లాండ్ దూకుడు నేర్చుకుంది. కాని టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఆ జాడ‌ల్లేవు. ఇప్ప‌టిదాకా ఉన్న టెస్ట్ క్రికెట్ టాంప్లెట్ ను మాత్ర‌మే వాడుతోంది. ఒక్క‌మాట‌లో నిల‌క‌డైన ఆట‌తీరు.
క్రికెట్ ను మెక్‌కల్లమ్‌ టేకోవర్ చేశాడా? బాజ్‌బాల్ హిట్టింగ్ అంటే ఏంటి?

ఇప్పుడు మెక్ క‌ల్ల‌మ్ ఇంగ్లండ్ ప్రధాన కోచ్. అత‌ను ఎలాంటివాడో న్యూజిలాండ్ చూస్తే అర్ద‌మ‌వుతుంది. జ‌ట్టు అత‌ని క‌ల్చ‌ర్ కి బానిస‌. ఆటని ఆట‌లాగే ఆడాలి. భ‌య‌మ‌నేది ఉండ‌కూడ‌దు. టీ20, టెస్ట్ క్రికెట్ మ‌ధ్య తేడా మాన‌సిక‌మేకాని, ఆట‌కాదు. అత‌నికి ఉత్సాహ‌మిచ్చేదే వీర ఉతుకుడు. ఇప్పుడు అందరూ అత‌ని స్టైల్ ను అర్దం చేసుకొంటారు. దానికో పేరు పెట్టారు. బాజ్‌బాల్ .

బాజ్‌బాల్ అంటే?(Bazball)

ఇంగ్లాండ్-ఇండియా టెస్ట్ మ్యాచ్ లో నిదానంగా ఆడుతున్న బెయిర్ స్టోని కోహ్లీ స్లెడ్జింగ్ చేశాడు. అంటే తిట్ల‌తో రెచ్చ‌గొట్టాడు. అప్పుడు బెయిర్ స్టో నోరు విప్ప‌లేదు. కోపాన్ని బ్యాటింగ్ లో చూపించాడు. అక్క‌డ నుంచి అత‌ని స్ట్ర‌యిక్ రేట్ 150. ఒక‌టే ఉతుకుడు. బౌల‌ర్లు అదిరిపోయారు. అదీ టెస్ట్ మ్యాచ్ లో. ఒక ఫీల్డర్ మిమ్మల్ని స్లెడ్జ్ చేసినప్పుడు దానికి స‌మాధ‌నం వీర ఉతుకుడిలో చూపిస్తే…. అదే బాజ్‌బాల్. మీరు ప్రత్యర్థి బౌలర్లకు గౌరవం ఇస్తారు. ఎలాగంటే, పిచ్ మీద ముందుకు వ‌స్తారు. ఫ్రంట్ ఫుట్ ను వాడి, బాల్ ఫోర్ కి, సిక్స‌ర్ కి పంపిస్తారు. అది బాజ్‌బాల్. బౌల‌ర్ అనే శ‌తుఘ్ని నుంచి బాల్ అనే గుండు దూసుకొస్తుంది. దాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం బ్యాట్ ను అడ్డుపెట్ట‌డంకాదు, దాన్ని మించిన వేగంతో ఆ గుండును బ‌లంగా బాద‌డం బాజ్‌బాల్ .

మ‌రి ఈ ఆట‌తీరు ఎవ‌రిది? 1996లో వ‌న్డేలో ఇలాంటి ఆట‌తీరునే శ్రీలంక చూపించింది. ఆస్ట్రేలియా ఓవ‌ర్ కు నాలుగు ర‌న్స్ ర‌న్ రేట్ ను సాధించాల‌ని ట్రై చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్. టెస్టుల్లో 5 ర‌న్ రేట్, వ‌న్డేల్లో 8, టీ 20ల్లో 10 ర‌న్ రేటును వాళ్లు సాధిస్తున్నారు. ఇక వ్య‌క్తిగ‌తంగా చెప్పాలంటే, ఆఫ్రిదిని మించిన హార్డ్ హిట్ట‌ర్ ఎవ‌రుంటారు? అంతెందుకు ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ లో పంత్ ఆట‌తీరు అదే క‌దా! ఇక మెక్ క‌ల్ల‌మ్ ది టెస్టుల్లోనూ దూకుడు ఆటేక‌దా! బాజ్ బాల్ ఎప్పుడో, ఎక్క‌డో పుట్టినా, దానికి ఓన‌ర్లు మాత్రం ఇప్పుడు మెక్ క‌ల్ల‌మ్ కోచింగ్ లో, దూకుడు మీదున్న ఇంగ్లాండ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి