iDreamPost

భారత్ vs ఆస్ట్రేలియా.. వరల్డ్ కప్ ఫైనల్లో గెలుపెవరిదంటే?

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కప్పు కొట్టాలి అని రెండు జట్లు ధీమాతో ఉన్నాయి. అయితే భారత్- ఆస్ట్రేలియా జట్లలో ఏ జట్టుకు విజయం అవకాశాలు ఉన్నాయో చూద్దాం.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కప్పు కొట్టాలి అని రెండు జట్లు ధీమాతో ఉన్నాయి. అయితే భారత్- ఆస్ట్రేలియా జట్లలో ఏ జట్టుకు విజయం అవకాశాలు ఉన్నాయో చూద్దాం.

భారత్ vs ఆస్ట్రేలియా.. వరల్డ్ కప్ ఫైనల్లో గెలుపెవరిదంటే?

వరల్డ్ కప్ 2023 ఆఖరి మజిలీకి చేరుకుంది. ఆ ఒక్క అడుగు వేసి వరల్డ్ కప్పును ఎవరు ముద్దాడుతారు? అంటూ.. యావత్ క్రికెట్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు వరల్డ్ కప్ కోసం ఫైనల్ లో తలపడుతున్నాయి. టీమిండియా 20 ఏళ్ల ప్రతీకారాన్ని తీర్చుకోవాలంటూ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా ఈసారి కూడా కప్పు తమదే అంటూ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే అసలు ఈ పోరులో గెలుపు ఎవరిది? జట్ల బలా బలాలు ఏంటి? ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? తెలియాలంటే ఈ ప్రిడిక్షన్ చూసేయండి.

ఒక్క మ్యాచ్ కూడా ఓటమి లేకుండా ఫైనల్ లో అడుగుపెట్టిన టీమిండియా ఒకవైపు. ఈ వరల్డ్ కప్ లో ఇంటికి వెళ్లిపోతుంది అనుకునే స్థితి నుంచి ఆస్ట్రేలియా ఫైనల్ లో అడుగుపెట్టింది. మరీ ముఖ్యంగా ఫైనల్స్ అంటే ఆస్ట్రేలియాకి కొట్టిన పిండి. ఏ చిన్న పొరపాటు చేసినా కోలుకోలేని దెబ్బ కొడుతుంది. అయితే భారత్ కూడా ఎంతో బలమైన స్థానంలో ఉంది. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎదురులేని శక్తిగా కొనసాగుతోంది. ఈ వరల్డ్ కప్ లో ఒక్క జట్టు కూడా మనల్ని ఓడించలేకపోయింది అంటేనే మన బలం ఏంటో అర్థం చేసుకోవాలి. అయితే ఆస్ట్రేలియాని తక్కువ అంచనా వేయనే కూడదు. వారికోసం రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాలు, ప్రణాళికలు కూడా రచిస్తోంది. టీమ్స్ వైజ్ గా ఏ జట్టు బలం ఎలా ఉందో చూద్దాం.

టీమిండియా బలాబలాలు:

టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. పైగా లీగ్ దశలో ఆస్ట్రేలియాని ఇప్పటికే ఒకసారి ఓడించాం. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ పై గేరు మార్చి ఆ బౌలర్లను కంగారు పెట్టాడు. ఇంక విరాట్ కోహ్లీ అయితే వన్డేల్లో 50 శతకాలు పూర్తి చేసుకుని మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. కోహ్లీ బ్యాట్ కనెక్ట్ అయితే స్కోర్ బోర్డు పరుగులు పెట్టకమానదు. ఇంక శుభ్ మన్ గిల్ మ్యాచ్ కే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. న్యూజిలాండ్ పై తృటిలో శతకం మిస్ చేసుకున్నాడు. కండరాలు పట్టేయడంతో ఫైనల్ కు దూరం అవుతాడనే భయపడ్డారు. కానీ, చివర్లో బ్యాటింగ్ వచ్చి అందరిలో ధైర్యాన్ని నింపాడు. గిల్ మరోసారి బ్యాట్ ఝళిపిస్తే కన్నుల పండుగే అవుతుంది.

ఇంక అయ్యర్ బ్యాట్ నుంచి మరో మెరుపు శతకాన్ని కోరుకోవచ్చు. మరోసారి అయ్యర్ అత్యంత వేగంగా శతకొట్టేస్తే చూసి ఆనందించేయచ్చు. ఇక్కడితోనే బ్యాటింగ్ లైనప్ అయిపోయింది అనుకుంటే పొరపాటే అవుతుంది. సూర్యకుమార్ యాదవ్, జడేజా కూడా అవకాశం వస్తే చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు షమీ బ్యాటు నుంచి మంచి షాట్లను కోరుకోవచ్చు. ఇంక బౌలింగ్ పరంగా చూసుకుంటే వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ ఉండనే ఉన్నాడు. ప్రతి మ్యాచ్ కి ఎంతో కొంత వేరియేషన్ చూపిస్తున్నాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లను కూడా ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఈ మ్యాచ్ లో 7 వికెట్లు కాకపోయినా కనీసం 4 వికెట్లు తీసినా కూడా ఆట మనదే అవుతుంది. ఇంక బుమ్రా, కుల్దీప్ యాదవ్, జడేజాలు ఫామ్ లోనే ఉన్నారు. సిరాజ్ కూడా కాస్త బౌలింగ్ మీద శ్రద్ధ పెడితే టీమిండియా బౌలింగ్ ధాటికి ఆసీస్ బ్యాటర్లు కచ్చితంగా కంగారు పడాల్సిందే.

ఆసీస్ బలాబలాలు:

ఫైనల్ అనగానే ఆస్ట్రేలియా జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోతుంది. ఎవరికి వాళ్లు విజయం కోసం పోరాడుతూ ఉంటారు. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ లైనప్ చూస్తే ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్మిత్ ఇలా ఎంతో దూకుడుగా ఆడగల బ్యాటర్లు ఉన్నారు. ఒకవేళ టాపార్డర్ విఫలమైతే మిడిలార్డర్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఉండనే ఉన్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే.. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కూడా బ్యాటింగ్ లో ఓ చేయేస్తున్నాడు. అయితే ఆసీస్ జట్టుకు ఏవైతే బలాలు అనుకుంటున్నామో.. వాటినే బలహీనతలుగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే స్పీడుగా బ్యాటింగ్ చేయాలనే ఉద్దేశంలో కంగారుగా ఆడి కంగారులు చాలాసార్లు వికెట్లు పోగొట్టుకున్నారు. అదే వారికి బలం.. బలహీనత కూడా. ఇంక బౌలింగ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్, కెప్టెన్ కమ్మిన్స్ ఫామ్ లో ఉన్నారు. కానీ, హేజల్ ఉడ్, జంపాలాంటి వాళ్లు బాల్ తో అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. బౌలింగ్ పరంగా మాత్రం టీమిండియాపై ఆసీస్ పెద్ద ప్రభావం చూపలేదనే చెప్పాలి.

పిచ్ రిపోర్ట్:

పిచ్ పరంగా చూసుకుంటే ఇది ఎక్కువగా స్పిన్ కే అనుకూలిస్తుంది. గతంలో జరిగిన వన్డే మ్యాచులు చూసుకుంటే.. స్పిన్ బౌలింగ్ లో ఓవర్ కు 5 పరుగుల కంటే తక్కువే ఉన్నాయి. అలాగని ఇక్కడ పరుగులు చేయడం కష్టమా అంటే.. ఇక్కడ హైఎస్ట్ స్కోర్ 365గా ఉంది. 2010లో సౌత్ ఆఫ్రికా ఈ పిచ్ పై రెండు వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. ఆ మ్యాచ్ లో కలిస్, డివిలియర్స్ ఇద్దరూ శతకాలు బాదారు.

విన్ ప్రిడిక్షన్:

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. రోహిత్, కోహ్లీ, గిల్, అయ్యర్, షమీ, బుమ్రా, కుల్దీప్, జడేజా కరెక్ట్ ఫామ్ లో ఉంటే టీమిండియాని కట్టడి చేయడం చాలా కష్టం. పిచ్ స్పిన్ కి అనుకూలించినా, అనూకూలించకపోయినా కూడా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆస్ట్రేలియా కంటే టీమిండియాకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో టీమిండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి.. వరల్డ్ కప్ ఫైనల్ లో గెలుపు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ప్లేయింగ్ లెవన్ అంచనా:

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జాస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు అంచనా:

ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిట్చెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, లుబుషేన్, మ్యాక్స్ వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్(కెప్టెన్), ఆడం జంపా, హేజల్ ఉడ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి