iDreamPost

మార్కెట్‌లో పెరిగిపోయిన కల్తీ ఆహార పదార్థాలు.. ఎలా కనిపెట్టాలి? వాటిని తింటే అంతే సంగతులు..

మార్కెట్‌లో పెరిగిపోయిన కల్తీ ఆహార పదార్థాలు.. ఎలా కనిపెట్టాలి? వాటిని తింటే అంతే సంగతులు..

మనం ప్రతిరోజు తినే అనేక ఆహారపదార్థాలు కల్తీ జరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు టీవీల్లో వార్తలు చూసి తెలుసుకోవడం తప్ప మనం వాటి గురించి పెద్దగా పట్టించుకోము. కానీ మనం రోజూ తినే ఆహార పదార్థాల్లో కల్తీ అనేది జరుగుతుంది. పాలు, తేనె, నెయ్యి, ఐస్ క్రీమ్స్, ఉప్పు, కారం.. ఇలా అనేక రకాల ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నారు.

కొన్ని ఆహార పదార్థాలు కల్తీ అని ఎలా కనుక్కోవచ్చో తెలుసుకోండి..

#మనం పొద్దున్నే లేచిన వెంటనే ఉపయోగించే పాలల్లో డిటర్జెంట్ పొడి, యూరియా, సింథటిక్ కలిపి కల్తీ చేస్తున్నారు. పాలను వేడి చేసినప్పుడు పాల రంగు పసుపుగా మారినా, తాగినప్పుడు చేదుగా ఉన్నా అవి కల్తీ జరిగినవి అని కనిపెట్టవచ్చు.
#తేనెలో పంచదార, బెల్లం పాకం కలుపుతారు. తేనె స్వచ్ఛమైనది ఐతే చేతి మీద వేసుకుంటే వెంటనే జారిపోతుంది. చేతికి అంటుకుంటే కల్తీ జరిగినట్లే.
#ఐస్ క్రీంపై కొద్దిగా నిమ్మరసం పిండితే అపుడు నురగలు లేదా బుడగలు వస్తే ఐస్ క్రీములో వాషింగ్ పొడిని కలిపి కల్తీ చేసినట్టే.
#ఆపిల్స్ పై మైనం పూత పూస్తారు దీనిని తొక్క తీసేటపుడు పరిశీలిస్తే తెలుస్తుంది.
#ఉప్పులో సుద్దపొడిని కలుపుతారు, ఉప్పుని వేడి చేస్తే సుద్దపొడి పైన పూతలా మారుతుంది.
#కారంలో ఇటుకపొడి కలుపుతున్నారు.
#మిరియాల్లో బొప్పాయి గింజలు కలుపుతున్నారు.

ఇలా చాలా పదార్థాలు మనకు తెలీకుండానే కల్తీవి తీసుకుంటున్నాము. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, అజీర్తి, కాలేయ సంబంధ వ్యాధులు, అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి వస్తాయి. కాబట్టి ఇక నుంచి ఆహార పదార్థాలను కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి