iDreamPost

Pic Talk:ఇనయా సుల్తానాని.. ఇలా ఎప్పుడూ చూసుండరు

  • Published Jan 01, 2024 | 6:18 PMUpdated Jan 01, 2024 | 6:18 PM

బుల్లితెర రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ద్వారా.. వారి కెరీర్ గ్రాఫ్ ను పెంచుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అసలు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని వారు కూడా.. ఈ షో ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు చెప్పుకోబోయే భామ కూడా ఈ కోవకు చెందినదే.

బుల్లితెర రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ద్వారా.. వారి కెరీర్ గ్రాఫ్ ను పెంచుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అసలు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని వారు కూడా.. ఈ షో ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు చెప్పుకోబోయే భామ కూడా ఈ కోవకు చెందినదే.

  • Published Jan 01, 2024 | 6:18 PMUpdated Jan 01, 2024 | 6:18 PM
Pic Talk:ఇనయా సుల్తానాని.. ఇలా ఎప్పుడూ చూసుండరు

బిగ్ బాస్ సీజన్-6 లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఓ ప్రముఖ దర్శకుడితో ఇంటర్వ్యూ తర్వాత ఈ అమ్మడి స్థాయి పూర్తిగా మారిపోయిందని చెప్పి తీరాలి.  ఆమె మరెవరో కాదు ‘ఇనాయ సుల్తానా’. బిగ్ బాస్ చూసిన బుల్లి తెర ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ గేమ్ షోలో అడుగుపెట్టిన తర్వాత.. మొదట కొన్ని విమర్శలు ఎదుర్కున్నా .. పోను పోను తన ఆటతో.. అందంతో ప్రేక్షకుల మనస్సును గెలుచుకుంది ఈ అమ్మడు.

బిగ్ బాస్ పుణ్యమా అని క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. బిగ్ బాస్ లో ఉన్నపుడే ఈ భామ తన అందంతో అందరిని కట్టపడేసేది. తన ఆటతో .. మాటతో అందరి మెప్పును పొందింది. అప్పటివరకు ఇనాయ సుల్తానా అంటే ఎవరో కూడా తెలియని ప్రేక్షకులకు.. ఒక్క రియాలిటీ గేమ్ షోతో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ బ్యూటీ. ఆ సీజన్ తర్వాత ఇనాయ క్రేజ్ మరింత పెరిగింది. ఈ క్రమంలో పలు చిత్రాలలో కూడా కనిపించి ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇక ఇనాయ ఓ చిత్రంలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ కొట్టేసిందని గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. కానీ, ఆ విషయమై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ.. కుర్రకారును హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

కాగా, మొదట హీరోయిన్ అవుదాం అని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇనాయ. కానీ, ఇండస్ట్రీలో నెగ్గుగు రావడం అంటే అనుకున్నంత సులువు కాదు. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉంటేనే.. ఈ రంగంలో రాణించే అవకాశం దక్కుతుంది. అయితే, ఇనాయకి ఆ అదృష్టం ఓ ప్రముఖ దర్శకుడిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా లభించింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో ఈ అమ్మడికి సంబంధించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆ సమయంలో ఈమె గురించి తెగ వెతికేశారు. దీనితో అందరికి అసలు ఇనాయ సుల్తానా ఎవరు అనే ఆసక్తి కలిగింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా మరో ఛాన్స్ కొట్టేసి తనేంటో నిరూపించుకుంది ఇనాయ. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోస్ ను నిత్యం షేర్ చేస్తూ.. వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. ఏదేమైనా హీరోయిన్ అవుదాం అని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ కల ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి. మరి, ఇనాయ సుల్తానా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Doulath sulthana (@inayasulthanaofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి