iDreamPost

ఈమె ఫోన్ కాల్ దేశాన్ని ఊపేస్తోంది! నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ తల్లి!

Charanjeet Kaur Video: ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక యువతి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె చేసిన ఆ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

Charanjeet Kaur Video: ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక యువతి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె చేసిన ఆ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

ఈమె ఫోన్ కాల్ దేశాన్ని ఊపేస్తోంది! నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ తల్లి!

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతగా పెరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఆ టెక్నాలజీ సాయంతో మంచి ఎంత జరుగుతోందో.. చెడు కూడా అంతే జరుగుతోంది. స్మార్ట్ పోన్ వచ్చాక.. లైఫ్ ఈజీ అవడమే కాకుండా డేంజర్ లో కూడా పడుతోంది. ముఖ్యంగా సైబర్ మోసాలు ఎక్కువ అయ్యాయి. చాలామంది అమాయక ప్రజలు కేటుగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం తాము మోసపోతున్నాం అనే విషయాన్ని గ్రహించి మోసగాళ్లకు సరైన బుద్ధి చెప్తారు. కానీ, ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారు. ఈ యువతి మాత్రం తనకు ఎదురైన మోసాన్ని వీడియో తీసి అందరినీ ఎడ్యుకేట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మాయి మాట్లాడిన ఫోన్ కాల్ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. మార్కెట్ లో జరుగుతున్న నయా మోసాన్ని చాటిచెప్పినట్లు అయ్యింది.

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు పోలీసులు కూడా ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా ఎంతో కొంత అవగాహన కలిగి ఉంటున్నారు. అందుకే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. చేసే మోసాల తీరు కూడా మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు లింక్స్ పంపడం, ఆఫర్ వచ్చిందని చెప్పి మోసం చేయడం చూశాం. జనాలు కూడా వారి ఉచ్చులో పడటం మానేశారు. అందుకని పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట మోసాలు చేశారు. తాజాగా ఇప్పుడు పోలీసుల పేరిట మోసాలు చేయడం ప్రారంభించారు. ఈ నయా మోసాన్ని ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ వెలుగులోకి తీసుకొచ్చింది. తనకి ఎదురైన ఈ వింత మోసం గురించి ఒక వీడియో తీసి అందరినీ అలర్ట్ చేసింది.

చరణ్ జీత్ కౌర్ ఒక సోషల్ మీడియా ఎన్ ఫ్లుఎన్సర్, జిమ్ ఫ్రీక్ కూడా. ఆమె తన జిమ్ వీడియోలు, మోడ్రన్ లుక్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ఒకరోజు ఆమెకు పోలీసుల ఫొటో ఉన్న నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వాళ్లు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఫోన్ లిఫ్ట్ చేసిన చరణ్ జీత్ కౌర్ కు త్వరగానే విషయం అర్థమైంది. ఫోన్ చేసిన వాళ్లు చరణ్ జీత్ కౌర్ గురించి అడిగారు. ఆమె ఇంట్లో లేదని చెప్పింది. తను బయటకు వెళ్లిందని చెప్పింది. అప్పుడు కేటుగాళ్లు వాళ్ల డ్రామా స్టార్ట్ చేశారు. చరణ్ జీత్ కౌర్ తమ వద్దే ఉందని, ఆమెను అరెస్ట్ చేశామంటూ చెప్పుకొచ్చారు. అలా ఎందుకు చేశారని అడగ్గా.. ఒక మంత్రి కుమారుడిని బ్లాక్ మెయిల్ చేసిందంటూ చెప్పుకొచ్చారు. అందుకే ఆమెను అరెస్ట్ చేశామన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Charanjeet Kaur (@charannshernii)

చరణ్ జీత్ కౌర్ ని మీడియా ముందు నిలబెడతాం.. ఆమె చేసిన పనిని అందరికీ చెప్తాం.. అప్పుడు మీ పరువు మొత్తం పోతుంది అంటూ బుకాయించారు. ఈమె తన చెల్లితో మాట్లాడించాల్సిదిగా కోరుతుంది. అలా చేయడం కుదరదని.. ఆమెను వేరే చోటుకు తీసుకెళ్తున్నాం అని చెప్పారు. అలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటూ చరణ్ జీత్ కౌర్ అడుగుతుంది. అందుకు రూ.20 వేలు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేయాలి అంటూ చెప్పారు. అలా కాకుండా ఎవరికైనా చెప్తే మొత్తం వ్యవహారం బయటపెడతాం అంటూ బెదిరిస్తారు. ఇంక చివరకి చరణ్ జీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చెప్పుతో కొడతాను.. నేనే చరణ్ జీత్ కౌర్ ని మాట్లాడుతున్నాను అంటూ అరుస్తుంది. అవతలి వ్యక్తి వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఈ మొత్తాన్ని వీడియో తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడమే కాకుండా.. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ కూడా జరుగుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Charanjeet Kaur (@charannshernii)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి