iDreamPost

సీఎం జగన్ పై చంద్రబాబు దిగజారుడు కామెంట్స్! వయసు ఒక్కటే పెరిగింది!

సీఎం జగన్ పై చంద్రబాబు దిగజారుడు కామెంట్స్! వయసు ఒక్కటే పెరిగింది!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కనక్కర్లేదు. ఎందుకంటే.. ఆయన గురించే ఆయనే ఎక్కువగా చెప్తుంటారు. ఈ ప్రపంచంలో తనను మించిన మేధావి లేడనట్లు, అసలు సాంకేతి వ్యవస్థలో ప్రతిదీ తానే కనిపెట్టినట్లు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు. హైద్రాబాద్ ను తానే  అభివృద్ధి చేశానని తరచూ చెప్తుంటారు. అంతేకాక 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కొత్త రాగం కూడా అందుకున్నారు. తన విజన్ తో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనని చెప్తుంటారు. ఇలాంటి మేధావి వయస్సు మీద పడే కొద్ది దిగజారుడుగా ప్రవర్తిస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేక పోలేదు. బుధవారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో చేసిన వ్యాఖ్యలే ఈ కామెంట్స్ కి కారణం అవుతున్నాయి.

బుధవారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో చంద్రబాబు పర్యటించారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సర్కార్‌పై చంద్రబాబు విమర్శలు చేశారు. పెట్టుబడి రాయితీలు ఇస్తామని రైతులను, ప్రజలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని మండి పడ్డాడు. జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అని, ఆయన బుద్దే వక్ర బుద్ధి అంటూ హద్దులు చెరిపేసి మరి చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

ప్రస్తుతం ఆయన చేసిన జగన్ పుట్టుక గురించిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు మండిపడుతున్నారు. చంద్రబాబు వయస్సు పెరిగే కొద్ది.. దిగాజారి ప్రవర్తిస్తున్నారని, అసలు ఆయన మనిషేనా అంటూ వైసీపీ అభిమానులు నిప్పులు చేరుగుతున్నారు. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారా? లేదంటే ఇంకేమైన తింటున్నారా అంటూ  వైఎస్సార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదు. ముక్కు నేలకు రాసి చంద్రబాబు.. వెంటనే క్షమాపణలు చెప్పాలని.. వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

చంద్రబాబు తన భార్యను అసెంబ్లీలో అవమానించారంటూ మీడియా ముందుకు వచ్చి గుక్క పెట్టి.. ఏడ్చిన సంగతి తెలిసిందే. మరి.. తన భార్యలాంటి వారేకదా ఇతర మహిళలు కూడా అనే కనీస జ్ఞానం చంద్రబాబుకు లేదా?. ఆయన ఇంట్లోని మహిళలు లోకానికి ఏమైనా అతీతులా అంటూ ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయా అనుభవం ఉన్న వ్యక్తి ఎంత హుందాగా  ప్రవర్తించాలి. అయితే గత కొన్నేళ్ల నుంచి, ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి చంద్రబాబు నాయుడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని రాజకీయా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి.. నలుగురి చేత ఛీ కొట్టించుకునేలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ వారు అంటున్నారు.

తనయుడు నారా లోకేశ్ అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో రాణించలేకపోవడం వల్లనే ఈ అసహనం, వింత ప్రవర్తన వచ్చిందని కొందరు అంటున్నారు. ఈ క్రమంలోనే రోజూ రోజూకు వయస్సు మీద పడే కొద్ది బాబు దిగాజారి ప్రవర్తిస్తున్నారని, ఏదైనా మంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలంటూ వైసీపీ నేతలు సైటెర్లు వేస్తున్నారు. వారి మాటలకు బలం చేకూర్చేలా చంద్రబాబు కూడా ప్రవర్తిస్తున్నారు. అందుకు నిదర్శనమే అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి.. చంద్రబాబుకు వయస్సు పెరిగే కొద్ది దిగజారి పోతున్నారంటూ వస్తున్న రూమర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి