iDreamPost

ఆంధ్రప్రదేశ్ లో కరోనా@955

ఆంధ్రప్రదేశ్ లో కరోనా@955

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ వెయ్యికి దగ్గరయింది.గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో 62 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో ప్రకటించింది. కొత్తగా కరోనా సోకిన కేసులతో కలుపుకుని ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955కు చేరింది. వీరిలో 145 మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.కరోనా కారణంగా ఇవాళ కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో మరొకరు మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా సోకి మరణించినవారి సంఖ్య 29కి చేరింది.ప్రస్తుతం వైరస్ యాక్టివ్ గా ఉన్న 781 మంది రాష్ట్రంలోని వివిధ కోవిడ్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ కొత్తగా కరోనా నిర్ధారణ అయిన జాబితాలో కర్నూలు జిల్లాలో 27,అనంతపురం జిల్లాలో 4,తూర్పు గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 14, ప్రకాశం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కోవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదైన జిల్లాల జాబితాతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో 261 కేసులు నమోదు కాగా, కరోనా నుంచి కోలుకుని నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ కారణంగా 8 మంది మరణించగా,ప్రస్తుతం 249 ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.అలాగే రెండో స్థానంలో ఉన్న గుంటూరు జిల్లాలో 206 మందికి కరోనా వైరస్ సోకగా 175 యాక్టివ్ కేసులు ఉన్నాయి.చిత్తూరు జిల్లాలో 73 కేసులు నమోదు కాగా,62 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 68 కేసులు నమోదు కాగా 61 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.ఇక అనంతపురం జిల్లాలో 31,తూర్పుగోదావరి జిల్లాలో 26 మంది, కడప జిల్లాలో 23 మంది,ప్రకాశం జిల్లాలో 51 మంది,పశ్చిమ గోదావరి జిల్లాలో 30 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి