iDreamPost

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల మొదటి వారం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వరుసగా వానలు పడుతున్నాయి. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది గురువారం నాటికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో గురు,శుక్ర, శని వారాల్లో ఇరు రాష్ట్రల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ వర్ష భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల గురు, శుక్ర, శనివారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో నేడు పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, కామారెడ్డి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. వాతావరణం చల్లగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉంది.. నేడు నగరంలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక ఏపీ విషయానికి వస్తే.. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షణి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. బలమూన ఈదురుగాలులు కూడా వీయవొచ్చని తెలిపింది. మత్స్యకారులను వేటకు వెళ్లవందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక చత్తీస్ ఘడ్, దక్షిణ ఒడిశా రాష్ట్రల్లో బంగాళాఖాతం ప్రభావం వల్ల పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి