iDreamPost

మీ ఆదాయం నెలకు 25,000 ఉందా? అయితే మీరు టాప్ 10 జాబితాలో ఉన్నట్లే!!

మీ ఆదాయం నెలకు 25,000 ఉందా? అయితే మీరు టాప్ 10 జాబితాలో ఉన్నట్లే!!

మారుతున్న కాలంతో పాటు వ్యక్తుల ఆదాయంలోనూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 5 ఏళ్ళలో భారతీయుల ఆదాయంలో ఇది స్పష్టంగా తెలుస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఒక ఏడాదిలో రూ.3,00,000 లేదా నెలకు రూ.25,000 సంపాదించే సగటు భారత పౌరులు దేశంలోని వేతన జీవుల్లో టాప్ 10 శాతంలో ఉన్నట్లుగా తేలింది.

ఈ అంశంపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చేసిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు బయటకొచ్చాయి. మన దేశంలో 15 శాతం మంది నెలకు 5 వేలు, అంతకంటే తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారట. అయితే దేశంలోని 5 నుంచి 7 శాతం ఆదాయం మొత్తం కేవలం ఒక్క శాతం ధనికుల జేబుల్లోకి వెళ్తున్నట్లుగా ఈ అధ్యయనం తెలిపింది.

మండలి వివరించిన లెక్కల ప్రకారం నెలకు రూ.25 వేలు సంపాదించే వారందరూ అత్యధిక ఆదాయం కలిగి ఉన్న టాప్ 10 శాతం జాబితలోకి వస్తారని ఆశ్చర్యపరిచే విషయాన్ని చెప్పింది. అంటే మన దేశ ఆదాయం మొత్తంలో వీరి వాటా 30-35 శాతంగా ఉంది.

రజనీకాంత్ శివాజీ సినిమాలో చెప్పినట్లుగా 1శాతం ధనికుల ఆదాయం అంతకంత రెట్టింపవుతోంటే, కిందనున్న 10శాతం పేదవారి ఆదాయం మాత్రం అంతే తీరులో పడిపోతోంది. ఈ అసమానతలు వీలైనంత త్వరగా తొలగించాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసింది ఈ నివేదిక. ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తే అనుకున్న లక్ష్యాలు నెరవేరవని హెచ్చరికలు సైతం ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి