iDreamPost

టాలెంట్ గురూ.. అతను IIM, IIT స్టూడెంట్ కాదు.. అయినా రూ. కోటి వార్షిక వేతనం!

క‌ృషి ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నాడు భారతీయ విద్యార్థి. పేరున్న విద్యాసంస్థల్లో చదవకున్నా కూడా ఏడాదికి ఏకంగా రూ. కోటి వేతనాన్ని అందుకుంటు ఔరా అనిపిస్తున్నాడు. ఆ వివరాలు మీకోసం..

క‌ృషి ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నాడు భారతీయ విద్యార్థి. పేరున్న విద్యాసంస్థల్లో చదవకున్నా కూడా ఏడాదికి ఏకంగా రూ. కోటి వేతనాన్ని అందుకుంటు ఔరా అనిపిస్తున్నాడు. ఆ వివరాలు మీకోసం..

టాలెంట్ గురూ.. అతను IIM, IIT స్టూడెంట్ కాదు.. అయినా రూ. కోటి వార్షిక వేతనం!

మన వద్ద ఏదైతే లేదో దాని గురించి ఆలోచించకుండా ఉన్న స్కిల్ పై ఫోకస్ చేస్తే లైఫ్ లో సక్సెస్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా చేసే పనిపట్ల శ్రద్ధ అంకిత భావం. సొసైటీలోని గొప్ప గొప్ప వాళ్లందరు ఆ విధంగా కీర్తి గడించిన వారే. ఇదే విధంగా ఓ భారతీయ విద్యార్థి తన టాలెంట్ తో అదరగొడుతున్నాడు. దేశం కాని దేశంలో కేవలం తన ప్రతిభతో ఏకంగా రూ. కోటి వార్షిక వేతనాన్ని అందుకుంటున్నారు. అలా అని అతను ఏ ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్ అనుకుంటే పొరపాటే. కేవలం బీటెక్ డిగ్రీ కలిగిన ఆ యువకుడు పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వారితో సమానంగా వేతనం తీసుకొవచ్చని నిరూపిస్తున్నాడు.

నేటి యువత ఎంత చదువుకున్న తమకు ఉద్యోగ అవకాశాలు దక్కడంలేదని నిరాశ వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొంత మంది యువత తమకున్న నైపుణ్యంతో లక్షలు, కోట్ల ప్యాకేజీలతో ఉద్యోగాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో గొప్ప గొప్ప విద్యాసంస్థల్లోనే చదవాల్సిన పనిలేదు.. సాధించాలనే తపన.. కావాల్సిన స్కిల్ ఉంటే అసాధ్యమంటూ ఏదీ లేదని ఆ యువకుడు మరోసారి ప్రూమ్ చేశాడు. అతను మరెవరో కాదు భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే బార్మర్‌ అనే జిల్లాలో నివసించే మహిపాల్ సేజు అనే భారత విద్యార్థి. అతడు ఓ జపాన్‌ కంపెనీ నుంచి కోటి రూపాయల వార్షిక వేతనాన్ని అందుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

monthly 1 crore salary

మహిపాల్‌ సేజు జోథ్‌పూర్‌లోని బార్మర్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో బీటెక్‌ విద్యను కంప్లీట్ చేశాడు. అయితే బీటెక్‌ చదువు కొనసాగుతుండగానే 2019లో ఓ ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా జపాన్‌లో నగోయాలోని ఓ కంపెనీలో రూ. 30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ ఉద్యోగంలో మూడేళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత మహిపాల్ సేజు జపాన్‌లోని టోక్యోలో మరో కంపెనీలో ఏకంగా రూ. కోటి వార్షిక ప్యాకేజ్‌ అందుకుని ఔరా అనిపించాడు. మహిపాల్‌ ప్రస్తుతం జపాన్‌లోని టోక్యోలో మెకానికా కార్పొరేషన్ అనే కంపెనీకి ఐటీ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మరి ఏడాదికి కోటి రూపాయల వేతనాన్ని అందుకుంటున్న మహిపాల్ సేజుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి